ఇన్‌స్టాగ్రామ్ లో భర్తను అన్ ఫాలో చేసిన శ్రీజ.. ఆ వార్తలే నిజమంటూ?

శ్రీజ కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకోబోతున్నారని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇటు శ్రీజ అటు కళ్యాణ్ దేవ్ ఈ వార్తల గురించి స్పందించకపోవడంతో చాలామంది ఈ వార్తలు నిజం కావచ్చని భావించారు.

 Sreeja Unfollows Husband Kalyan Dev On Instagram Goes Viral Details, Sreeja, Kal-TeluguStop.com

తాజాగా శ్రీజ ఇన్‌స్టాగ్రామ్ లో భర్తను అన్ ఫాలో చేశారు.శ్రీజ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల త్వరలో శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోవడం ఖాయమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో కళ్యాణ్ దేవ్ మాత్రం శ్రీజను ఫాలో అవుతుండటం గమనార్హం.కొన్నిరోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో పేరును మార్చుకున్న శ్రీజ తాజాగా అభిమానులకు షాకిచ్చేలా తీసుకున్న నిర్ణయం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐదేళ్ల క్రితం శ్రీజ కళ్యాణ్ దేవ్ వివాహం జరగగా ఈ జంటకు ఒక పాప ఉన్నారు.అటు శ్రీజ కానీ ఇటు కళ్యాణ్ దేవ్ కానీ విడిపోతున్నామని అధికారికంగా చెప్పలేదు.

అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని శ్రీజ, కళ్యాణ్ దేవ్ చెప్పకనే చెబుతున్నారు.

Telugu Kalyan Dev, Kinnerasani, Fans, Sreeja, Sreejakalyan, Sreejaunfollow, Macc

ఇప్పటికే పలువురు సెలబ్రిటీ జోడీలు విడిపోయిన నేపథ్యంలో శ్రీజ కళ్యాణ్ దేవ్ కూడా విడిపోతే ఆ వార్త అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పాలి.మరోవైపు కళ్యాణ్ దేవ్ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా సినిమా రంగం అతనికి కలిసిరాలేదనే చెప్పాలి.సంక్రాంతికి కళ్యాణ్ దేవ్ హీరోగా నటించి విడుదలైన సూపర్ మచ్చి ఫ్లాపైంది.

Telugu Kalyan Dev, Kinnerasani, Fans, Sreeja, Sreejakalyan, Sreejaunfollow, Macc

హీరో కళ్యాణ్ దేవ్ కూడా సినిమాకు ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను పట్టించుకోలేదు.కళ్యాణ్ దేవ్ తర్వాత సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.కిన్నెరసాని పేరుతో కళ్యాణ్ దేవ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube