నిజాలు బయటపెట్టిన మెగాస్టార్ అల్లుడు

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి అప్పుడే మూడో సినిమాకి రెడీ అయిన కుర్ర హీరో కళ్యాణ్ దేవ్.మెగాస్టార్ చిన్నకూతురు శ్రీజ రెండో భర్తగా కళ్యాణ్ దేవ్ అందరికి సుపరిచితమే.

 Sreeja Kalyan Friends From School, Tollywood, Telugu Cinema, Mega Family, Megas-TeluguStop.com

అయితే భార్యాభర్తలు ఇద్దరూ పెళ్లి తర్వాత ఎప్పుడూ మీడియా ముందుకి రాలేదు.వీలైనంత వరకు మీడియాకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

కళ్యాణ్ దేవ్ హీరోగా సినిమాలతో బిజీగా ఉంటే సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా రాణించడానికి ప్రయత్నం చేస్తుంది.ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా ఇద్దరూ మొదటి సారి ఓ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

వారి పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ సందర్భంగా కళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ సుస్మిత తనకి చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని, మేమిద్దరం బెంచ్ మేట్స్ అని పేర్కొన్నాడు.

తరువాత ప్రయాణాలు కొంతకాలం వేరైనా తరువాత ప్రేమించి పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నామని తెలిపారు.

తన సినిమాల ఎంపిక విషయంలో మెగా హీరోల ఇన్వాల్వ్ మెంట్ పెద్దగా ఉండదని కళ్యాణ్ దేవ్ అన్నారు.

సినిమా ఎంపిక అనేది నా నిర్ణయం అని, సినిమాల్లోకి రావాలని చాలా కాలం నుండే అనుకున్నాను.అది సమయం వచ్చింది అలా జరిగి పోయిందని పేర్కొన్నాడు.సినిమాల్లో ప్రతిభ ఉన్న వారినే ప్రేక్షకులు ఆధరిస్తారు.నాకు ఉన్న పతిభ మరొకరికి ఉండదు.

మరొకరికి ఉన్న ప్రతిభ నాకు ఉండదు.ఎవరి ప్రతిభ వారి ప్రత్యేకం.

కనుక సినిమా ఇండస్ట్రీలో మనుగడ సాధించడం అనేది ప్రతిభపై ఆధారపడి ఉంటుంది అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube