శ్రీవిష్ణు, ప్రదీప్ వర్మ, లక్కీ మీడియా 'అల్లూరి' ఫస్ట్ లుక్ విడుదల

హీరో శ్రీవిష్ణు వైవిధ్యమైన కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేస్తున్నారు.ప్రస్తుతం ఓ పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌లో నటిస్తున్నారు.‘అల్లూరి’ అనే పవర్ ఫుల్ టైటిల్ తో ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు.బెక్కెం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

 Sree Vishnu, Pradeep Varma, Lucky Media’s Alluri First Look Released , Sree Vi-TeluguStop.com

ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో ‘నిజాయితీకి మారుపేరు’ అనే పవర్ ఫుల్ ట్యాగ్ లైన్ హీరో పాత్రని సూచించేలా వుంది.

ఈ పాత్ర కోసం పూర్తిగా ట్రాన్సఫర్మేషన్ అయిన శ్రీవిష్ణు ఖాకీ యూనిఫాంలో చేతిలో తుపాకీని పట్టుకుని డాషింగ్ గా కనిపించారు.వర్షంలో చేతిలో గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో నడుస్తూ రావడం స్టన్నింగా వుంది.

సిన్సియర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న అల్లూరి ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా వుంది.

దర్శకుడు ప్రదీప్ వర్మ నిజాయితీ గల ఒక పోలీసు కథ చెప్పడానికి చాలా రిసెర్చ్ చేశారు.

ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన రోజు మొదలైన ప్రయాణంలో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు, అతను చేసే త్యాగాలు, సమాజం, ఉన్నతాధికారుల నుండి అతను ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొన్నాడనే అంశాలు ఆసక్తికరంగా చూపించబోతున్నారు.అతను తన ఆలోచనలతో మొత్తం డిపార్ట్‌మెంట్‌లో పెద్ద మార్పును తీసుకువస్తాడు.

అన్నివేళలా కర్తవ్యానికి ప్రాధాన్యత ఇచ్చే నిజాయితీ గల పోలీసు అధికారులకు ఘనమైన నివాళిగా ఈ చిత్ర వుంటుంది.ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ధర్మేంద్ర కాకరాల ఎడిటర్ గా విఠల్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.అల్లూరి ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది.త్వరలో విడుదల తేదీని ప్రకటించి, ప్రమోషన్‌లను ప్రారంభించనుంది చిత్ర యూనిట్.

తారాగణం: శ్రీవిష్ణు, కయ్యదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, వెన్నెల రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube