ఆ హీరో నా ప్రాణ స్నేహితుడంటున్న శ్రీ విష్ణు...

తెలుగులో మొదట్లో పలువురి స్టార్ హీరోల చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగినటువంటి హీరో శ్రీ విష్ణు గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఇతడు ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క స్టార్ హీరోల చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Sree Vishnu, Nara Rohith, Best Friend, Tollywood, Sree Vishnu Best Friend News-TeluguStop.com

శ్రీ విష్ణు నటించిన “ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్ మదిలో, అప్పట్లో ఒకడుండేవాడు, బ్రోచేవారెవరురా, నీది నాది ఒకే కథ, వీర భోగ వసంత రాయలు, తిప్పరా మీసం” తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.అయితే తాజాగా శ్రీ విష్ణు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా తన గురించి పలు ఆసక్తికర అంశాలను తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నాడు.అయితే ఇందులో తెలుగు సినీ పరిశ్రమలోని తన స్నేహితుల గురించి చెబుతూ సినిమా ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితుడు మరియు ప్రాణస్నేహితుడు నారా రోహిత్ అని చెప్పుకొచ్చాడు.

అంతేగాక ఇద్దరూ కూడా నటి కలిసి నటించిన టువంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకున్నాయని కూడా తెలిపాడు.అయితే నారా రోహిత్ ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా తన కోసం షాపింగ్ చేస్తుంటాడని తాను కూడా అదే విధంగా ఏదైనా నారా రోహిత్ కోసం ఏదైనా తీసుకోవాలనిపిస్తే వెంటనే తీసుకుంటానని కూడా తెలిపాడు.

ఇప్పటి వరకు తమ వద్ద మధ్య విభేదాలు గాని మనస్పర్థలు గాని రాలేదని నారా రోహిత్ కూడా ఎప్పుడు తన మనసుకి కష్టం కలిగించే విధంగా ప్రవర్తించలేదని, నారా రోహిత్ చాలా సున్నిత మనస్తత్వం కలవాడని కూడా తెలిపాడు.

అటువంటి స్నేహితుడు తనకు దొరకడం నిజంగా తన అదృష్టం అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అంతేకాక సినిమాల విషయంలో కూడా ఏదైనా తన బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే పాత్ర ఏదైనా సరే నారా రోహిత్ చిత్రంలో ఉంటే కచ్చితంగా నటిస్తానని చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube