తెలుగులో ఇటీవలే ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “నగ్నం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన దేవరపల్లి స్వీటీ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలను తెగ వైరల్ అవుతోంది. ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తన హాట్ హాట్ అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో హీట్ అమాంతం పెంచేసింది.
అయితే తాజాగా శ్రీ రాపాక అలియాస్ స్వీటీ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమలో ఎదుర్కున్నటువంటి కొన్ని సంఘటనల గురించి అభిమానులతో పంచుకుంది.
ఇందులో భాగంగా తాను నగ్నం చిత్రం లో హీరోయిన్ గా పని చేయక ముందు సినీ పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశానని చెప్పుకొచ్చింది.ఆ సమయంలో ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రాశీ ఖన్నా చిత్రానికి కాస్ట్యూమ్స్ అందించే పనిలో భాగంగా ఆమెతో కొంతకాలం పని చేశానని, ఆ సమయంలో తాను రాశీ ఖన్నా నుంచి పలురకాల ఇబ్బందులు ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇందులో భాగంగా ఎప్పుడు పడితే అప్పుడు రాశీ ఖన్నా చీర కట్టడానికి పిలిచేవారని ఆమె కూడా పని అయిపోయినా సరే ఇంటికి వెళ్లేందుకు అనుమతించేది కాదని ఈ కారణంగా పలుమార్లు ఇంటికి లేటుగా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది.
అలాగే గతంలో తాను టాలీవుడ్ లెజెండ్ యాక్టర్ నందమూరి నట సింహం బాలకృష్ణ చిత్రాలకి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశానని తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దేవరపల్లి స్వీటీ నటించినటువంటి నగ్నం చిత్రం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.సినిమా కథ సంగతి అటుంచితే ఈ అమ్మడి కోసమే కొంతమంది ప్రత్యేకంగా రెండు వందల రూపాయలు టికెట్ కొని ఆన్ లైన్ లో సినిమా చూసినట్లు ఇప్పటికే కొందరు అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు.
అయితే ఈ చిత్రం షూటింగ్ మొత్తం రామ్ గోపాల్ వర్మ రెండు రోజుల్లోనే పూర్తి చేశాడని, అంతేగాక ఈ చిత్రంలో తాను హీరోయిన్ గా నటించినందుకు తనకు దాదాపుగా రెండు లక్షల రూపాయలు పారితోషికం ఇచ్చారని కూడా తెలిపింది.