హామీదకు శ్రీరామ్ చంద్ర ప్రేమలేఖ.. హామీద షాకింగ్ రిప్లై?

బిగ్ బాస్ హౌస్ లో సింగర్ శ్రీరామ్, హమీద లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే.హమీద హౌస్ లో ఉన్నన్ని రోజులు వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

 Bigg Boss Sree Rama Chandra Love Letter To Hameeda Details,  Bigg Boss 5, Telugu-TeluguStop.com

అయితే ఊహించని విధంగా హమీద బయటకు రావడంతో శ్రీరామ్ పూర్తిగ డల్ అయినట్లు తెలుస్తుంది.ఇకపోతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కొందరు కంటెస్టెంట్ లు స్టార్ మాలో ప్రసారమయ్యే స్టార్ట్ మ్యూజిక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి హామీద నటరాజు మాస్టర్, లోబో, సరయు వంటి మొదలైన వారు హాజరయ్యారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమోలో భాగంగా సుమ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి శ్రీ రామచంద్ర తన గర్ల్ ఫ్రెండ్ లవ్ లెటర్ రాశారని చదివి వినిపించింది.

అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శ్రీ రామచంద్ర తనకు ఎలా లవ్ లెటర్ రాశారనే విషయం చెప్పాల్సి ఉంది.ఇక సుమ శ్రీరామ్ రాసిన లవ్ లెటర్ చదువుతున్న సమయంలో బిగ్ బాస్ హౌస్ లో శ్రీ రామచంద్ర, హమీద కలిసి ఉన్నటువంటి వీడియో క్లిప్స్ ప్లే చేశారు.

ఇక అది చూసిన హామీద ఎంతో సంతోషపడి శ్రీరామ్ పై తనకున్న ప్రేమను వ్యక్త పరిచింది.

Telugu Anchor Suma, Bigg Boss, Biggboss, Hameedalove, Hamida, Lobo, Love Letter,

ఈ క్రమంలోనే తన చేతి వేళ్ళతో లవ్ సింబల్ చూపిస్తూ తన ప్రేమను మరొకసారి వ్యక్తపరిచింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామ్ నువ్వు గెలిచి వస్తావని, నా అనంతమైన ప్రేమ ఎల్లప్పుడూ నీతో ఉంటుందని శ్రీరామ్ మాటలకు హమీద తన పై తనకున్న ప్రేమను వ్యక్త పరిచింది.ఈ క్రమంలోనే ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ కార్యక్రమం ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్ లు చేసిన హంగామా చూడాలంటే ఆదివారం వరకు వేచి ఉండాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube