ఎన్టీఆర్ సినిమాలో సందడి చేయబోతున్న పెళ్లి సందD భామ!

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్షన్ లో రోషన్ హీరోగా తెలుగు అమ్మాయి శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ‘పెళ్లి సందD‘.ఈ సినిమా ఇటీవలే భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ దక్కించుకుంది.

 ఎన్టీఆర్ సినిమాలో సందడి చేయబ�-TeluguStop.com

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోక పోయిన ఈ సినిమాలో చేసిన శ్రీలీల కు మాత్రం మంచి గుర్తింపు లభించింది.

ఈమెకు వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి.

దీంతో ఈ అమ్మడి ఫ్యూచర్ మరొక రేంజ్ లోకి వెళ్లబోతుందని అంతా భావిస్తున్నారు.ఇప్పటికే శ్రీలీల మాస్ రాజా రవితేజకు జోడిగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ నే కన్ఫర్మ్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

దీంతో పాటు మరొక మెగా హీరో సినిమాలో కూడా అవకాశం ఇటీవల ప్రచారం జరిగింది.

Telugu Koratala Shiva, Sree Leela, Sreeleela, Tollywood-Movie

ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది అని కూడా వార్తలు వచ్చాయి.అయితే మెగా హీరోల్లో ఎవరు ఈ భామకు అవకాశం ఇచ్చారు అనేది ఇంకా తెలియలేదు.ఇక ఈ రూమర్స్ వినిపిస్తుండగానే మరొక రూమర్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ అమ్మడికి మరొక బిగ్ ప్రాజెక్ట్ లో కూడా అవకాశం వచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Telugu Koratala Shiva, Sree Leela, Sreeleela, Tollywood-Movie

పెళ్లి సందD సినిమా ప్లాప్ అయినా కూడా ఈమె అందం, అభినయం అందరిని ఆకట్టుకున్నాయి.దీంతో స్టార్ హీరోలు సైతం ఈ బ్యూటీ కి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట.అందులో భాగంగానే ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం ఈ బ్యూటీ ని పరిశీలిస్తున్నట్టు టాక్.

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ల పేర్లు వినిపిస్తున్నాయి.కానీ ఒక్కరిని కూడా కన్ఫర్మ్ చెయ్యలేదు.కోట్లు ఖర్చుపెట్టి బాలీవుడ్ ముద్దుగుమ్మలను తీసుకునే బదులు కోటి లోపు పారితోషికం తీసుకునే శ్రీలీల అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట.మరి ఈ విషయంలో తుది నిర్ణయం ఎన్టీఆర్ నే తీసుకోవలసి ఉంటుంది.

చూడాలి ఈ బ్యూటీని ఈ సినిమాలో తీసుకుంటారో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube