ఈ స్టార్ హీరోయిన్ తెలుగు సీనియర్ నటి మేనకోడలని మీకు తెలుసా..?  

Sree lakshmi, Telugu Senior actress, Sree lakshmi nice\'s Aishvarya rajesh news, Telugu heroine, Tollywood - Telugu Sree Lakshmi, Sree Lakshmi Nice\\'s Aishvarya Rajesh News, Telugu Heroine, Telugu Senior Actress, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన “వరల్డ్ ఫేమస్ లవర్”చిత్రంలో సువర్ణ అనే తెలంగాణ యువతి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “హీరోయిన్ ఐశ్వర్య రాజేష్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయంపాలైనప్పటికీ  ఐశ్వర్య రాజేష్నటించిన “సువర్ణ” పాత్రకు మాత్రం సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.

 Sree Lakshmi Iswarya Rajesh Rajesh Tuck Jagadeesh

అంతేగాక పలు తమిళ, తెలుగు సినిమా అవకాశాలు కూడా క్యూ కట్టాయి.

అయితే ఇప్పటి వరకు చాలా మందికి ఐశ్వర్య రాజేష్ గురించి తెలియని విషయం ఏంటంటే ఈమె తెలుగు సీనియర్ నటి శ్రీ లక్ష్మి సొంత తమ్ముడు మరియు సీనియర్ నటుడు రాజేష్ కూతురని.

ఈ స్టార్ హీరోయిన్ తెలుగు సీనియర్ నటి మేనకోడలని మీకు తెలుసా..-Latest News-Telugu Tollywood Photo Image

అయితే సినిమా అవకాశాల కోసం సీనియర్ నటుడు రాజేష్ అప్పట్లో మద్రాసు వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అవ్వడంతో ఈ విషయం ఎవరికీ తెలియదు.అంతేగాక అప్పట్లో ఐశ్వర్య రాజేష్ ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వం వహించిన “రాంబంటు” అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

అయితే సినిమాల పరంగా రాణించాలంటే అందం మరియు శరీరపు కలర్ అవసరం లేదని టాలెంట్ ఉంటే కచ్చితంగా ఏదో ఒక రోజు విజయం సాధించవచ్చని ఐశ్వర్య రాజేష్ నిరూపించింది.అయితే ఒకప్పుడు తాను సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు కొందరు దర్శక నిర్మాతలు తన స్కిన్ కలర్ చూసి నువ్వు నువ్వు హీరోయిన్ గా పనికి రావంటూ ఎద్దేవా చేశారని కానీ ఇప్పుడు ఆ దర్శకనిర్మాతలు తలదించుకునే విధంగా తన చేతిలో సినిమా ఆఫర్లు ఉన్నాయని గతంలో ఐశ్వర్య రాజేష్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న  “టక్ జగదీష్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.

 ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.తమిళ భాషలో కూడా ఐశ్వర్య రాజేష్ దాదాపుగా 5 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

#Sree Lakshmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sree Lakshmi Iswarya Rajesh Rajesh Tuck Jagadeesh Related Telugu News,Photos/Pics,Images..