మెగా రామాయణంకు 11 కోట్లు డిమాండ్‌ చేసిందట  

Sradha Kapoor Demand 11 Crores Ruppes In Allu Aravindh Mega Ramayanam - Telugu Deepika Padukone, Hruthik Roshan, Mega Ramayanam, Prabhas, Sradha Kapoor

అల్లు అరవింద్‌ ఇంకా ప్రముఖ ఫిల్మ్‌ మేకర్స్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించబోతున్న ‘రామాయణం’ చిత్రంలో రాముడి పాత్రకు గాను హృతిక్‌ రోషన్‌ను అనుకుంటున్నారు.రావణుడి పాత్రను ప్రభాస్‌తో చేయించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.

Sradha Kapoor Demand 11 Crores Ruppes In Allu Aravindh Mega Ramayanam

ఇదే సమయంలో రామాయణంలో మరో ముఖ్యమైన పాత్ర అయిన సీత పాత్రకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ను సంప్రదిస్తున్నారు.నిన్న మొన్నటి వరకు దీపిక పదుకునేతో సంప్రదింపులు జరుగుతున్నట్లుగా ప్రచారం జరిగింది.

ఇప్పుడు ఆమె స్థానంలో శ్రద్దా కపూర్‌తో చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

మెగా రామాయణంకు 11 కోట్లు డిమాండ్‌ చేసిందట-Movie-Telugu Tollywood Photo Image

  నిర్మాత మధు మంతెన ఇటీవలే శ్రద్దా కపూర్‌తో చర్చలు జరిపాడని, రామాయణంలో సీత పాత్రను చేసేందుకు ఆమె ఏకంగా 11 కోట్ల పారితషికంతో పాటు ఇతర ఖర్చులు మొత్తం కలిపి 15 కోట్ల వరకు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసిందట.ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సిన కారణంగా ఇంత మొత్తంను ఆమె డిమాండ్‌ చేసింది.కాల్షీట్లు పెరిగితే పారితోషికం పెంచాలని కూడా ఆమె ముందే చెప్పిందట.

దాంతో ఆలోచనల్లో పడ్డ నిర్మాతలు త్వరలో ఒక నిర్ణయానికి వస్తామని ఆమెతో చెప్పారు.

  బాలీవుడ్‌తో పాటు ఇండియాకు చెందిన అన్ని భాషల్లో కూడా ఆమెకు గుర్తింపు ఉంది.అందుకే ఆమె అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.పారితోషికం విషయంలో మరోసారి చర్చలు జరిపి ఆమెను ఖరారు చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం పేపర్‌ వర్క్‌ జరుగుతున్న ఈ చిత్రంను వచ్చే ఏడాదిలో పట్టాలెక్కించే అవకాశం ఉంది.ఇండియాలో ఇప్పటి వరకు రాని విధంగా ఒక హాలీవుడ్‌ రేంజ్‌ సినిమా మాదిరిగా ఈ చిత్రంను నిర్మించేందుకు నిర్మాతలు సిద్దం అవుతున్నారు.

రెండు లేదా మూడు పార్ట్‌లుగా ఈ చిత్రంను విడుదల చేసే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sradha Kapoor Demand 11 Crores Ruppes In Allu Aravindh Mega Ramayanam Related Telugu News,Photos/Pics,Images..

footer-test