పాత్ర కోసం 50 లక్షల నగలా.. ఎన్టీఆర్ పై విమర్శలు చేసిన కృష్ణ?

తెలుగు చిత్ర పరిశ్రమలో అన్నగారు నందమూరి ఎన్టీ రామారావుది ఎప్పటికీ ప్రత్యేకమైన ప్రస్థానం అన్న విషయం తెలిసిందే.తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నారు ఆయన.

 Super Star Krishna Comments On Nt Ramarao Brahmasri Vishwamitra Movie Details, S-TeluguStop.com

కేవలం సినిమా హీరోగానే మాత్రమే కాకుండా ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రిగా కూడా ఎన్టీరామారావు గుర్తింపు సంపాదించుకున్నారు.అంతేకాదు అప్పట్లో తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి టిడిపి పార్టీ తో చుక్కలు చూపించింది కూడా అటు ఎన్టీఆర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అయితే ఎన్టీఆర్ టిడిపి పార్టీ ని పెట్టి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర.

ఇక ఈ సినిమాలో విశ్వామిత్రుడి పాత్రలో నటించాడు ఎన్టీఆర్.

ఇక ఎన్టీఆర్ కెరీర్లో ఇది ఒక మైలురాయి లాంటి సినిమా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అయితే ఈ సినిమా సమయంలో ఎన్నో విమర్శలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు ఎన్టీఆర్.

అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా అఖిలభారత ఎన్టీఆర్ అభిమాన సంఘం భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.ఈ ఊరేగింపులో లక్షల మంది పాల్గొంటారని అభిమాన సంఘం చెప్పింది.

కానీ కొంతమంది అభిమానులు మాత్రమే వచ్చారు.ఏకంగా పోలీసులే ఎక్కువగా కనిపించారు.

Telugu Jewels, Congress, Krishna Ntr, Nt Ramarao, Senior Ntr, Sr Ntr, Sr Ntr Kri

ఇక ఈ ఊరేగింపులో 13 లారీలు ఒక టూరిస్ట్ బస్సులూ, 2 టెంపోలు, 20 అంబాసిడర్ కార్ లూ, 25 ఆటోలు, 50 స్కూటర్లు పాల్గొన్నాయ్.ఇదంతా జరిగిన మర్నాడు సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసారు.ఎన్టీఆర్ తెలుగు ప్రజలను త్రిశంకు స్వర్గంలోకి వేసేందుకే బ్రహ్మర్షి విశ్వామిత్ర చేస్తున్నారని విమర్శించారు.విశ్వామిత్ర పాత్ర కోసం 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి డబ్బులు దుబారాగా ఖర్చు చేయడం ఏంటి అని ప్రశ్నించారు.

మహిళల కోసం ఆసుపత్రి నిర్మిస్తాను అంటూ ప్రకటించిన ఎన్టీఆర్ లక్షల ఖర్చుతో నగలు కొనుక్కోవడం ఏంటి.? వెంటనే వాటిని ట్రస్ట్ ఇచ్చేయాలంటూ డిమాండ్ చేశారు కృష్ణ.సినిమా రంగంలో ఎవరు ఇలా చేయలేదంటూ విమర్శలు గుప్పించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube