షూటింగ్ లో మిరపకాయలు తిన్న ఎన్టీఆర్.. ఆ తరువాత పరుగో పరుగు?

తెలుగు చిత్ర పరిశ్రమలో నట సార్వభౌముడు అని బిరుదు సొంతం చేసుకోవడం కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైంది.అయితే ఈ బిరుదు ఊరికే రాలేదు.

 Sr Ntr Unbeilvable Act And Vanisri Laughed Details ,senior Ntr, Edureeta Movie,-TeluguStop.com

ఆయన సినిమాలంటే ప్రాణంగా నటన అంటే ఊపిరిగా బ్రతికాడు.ఇక ఏ సినిమాలో చేసిన ఆయన పని పట్ల చూపించే నిబద్ధత ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉండేది.

కేవలం హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా రచయితగా కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ప్రఖ్యాతిగాంచారు.అంతే కాదు ఎలాంటి డూప్ లేకుండానే సినిమాలు ఎన్నో రిస్క్ లు కూడా చేస్తూ ఉండేవారు.

ఇక 1977 సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఎదురీత అనే సినిమాలో నటించారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

వి.మధుసూదనరావు దర్శకత్వంలో వాణిశ్రీ హీరోయిన్ గా ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది.ఇక ఈ సినిమాలో ఎంతో కీలకమైన విలన్ పాత్రలో కైకాల సత్యనారాయణ నటించారు.ఈక్రమంలోనే రన్నింగ్ షాట్స్ తీయాల్సి ఉంది.ఇక ఒకవైపు నటీనటుల పరుగులు పెడుతూ ఉంటే అదే సమయంలో షూటింగ్ చేయాలి.

ఇక ఇంతలో కైకాల సత్యనారాయణ పరుగు అందుకున్నారు.

ఇక అదే సమయంలో ఒక ఇనప రాడ్ ఎన్టీఆర్ ముఖానికి గట్టిగా తగిలింది.రక్తం కూడా కారింది.

Telugu Edureeta, Vanisri, Ntr Ate, Ntr, Senior Ntr, Sr Ntr, Tollywood-Movie

దీంతో ఇది చూసి అందరూ కంగారు పడిపోయారు.ఇక అక్కడితో వెంటనే షూటింగ్ ఆపి ఎన్టీఆర్తో పాటు అందరూ ఒడ్డుకు వచ్చేసారు.అయితే ఒడ్డు పక్కనే మిరప తోట ఉంది.మిరపకాయలు కోసి ఎండబెట్టారు.ఇక ఇది చూసిన నందమూరి తారకరామారావు వెంటనే ఆ మిరపకాయలు తీసుకొని నోట్లో వేసుకున్నాడు.ఇదంతా గమనిస్తున్న హీరోయిన్ వాణిశ్రీ ఒక్కసారిగా షాక్ అయింది.

ఒకటి కాదు ఏకంగా నాలుగు మిరపకాయలు నమిలిన తర్వాత పదండి షూటింగ్ చేద్దాం అంటూ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఇలా తనకు తగిలిన దెబ్బ నొప్పి తట్టుకునేందుకు ఎన్టీఆర్ మిరపకాయలు తిని షూటింగ్లో పాల్గొనడం చూసి అక్కడున్న వారందరూ ఆయన నిబద్ధతకు ఫిదా అయిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube