జ్యోతిష్యుడు చెప్పాడని.. ఎన్టీఆర్ సంచలన నిర్ణయం.. చివరికి కోట్ల రూపాయలు పోయాయి?

నటసార్వభౌముడు తెలుగు చిత్ర పరిశ్రమకు ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప నటుడు.తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి.

 Sr Ntr Trust Towards Astrologist Details, Senior Ntr, Astrologist, Dakshayagnam-TeluguStop.com

ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆయన ఎవరో కాదు నందమూరి తారక రామారావు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ పాత్ర చేయాలన్నా ఆయనకే సొంతం.ఏ పాత్రకు ప్రాణం పోయాలన్న ఆయన తోనే సాధ్యం.

ఇక ఎన్నో వందల చిత్రాల్లో నటించి ప్రతీ పాత్రలో కూడా ఆయన తప్ప ఇంకెవరు సెట్ కారేమో అన్నంతగా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో నందమూరి తారక రామారావు ని కొట్టే వాళ్లే లేరు అని చెప్పాలి.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప శక్తిగా ఎదిగిన ఆయన ఆ తర్వాత కాలంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులను చవిచూశారు.నందమూరి తారక రామారావు ఏ విషయంలో అయినా సరే ఖచ్చితత్వంతో ఉంటారు.

ఇలాంటి నందమూరి తారకరామారావు ఒక జ్యోతిష్కుడు చెప్పాడు అన్న కారణంతో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అన్న విషయం చాలా మందికి తెలియదు.అనగనగా 1962 ఆ సమయంలో దక్షయజ్ఞం సినిమాలో నటించారు నందమూరి తారక రామారావు.

పరమశివుడు క్యారెక్టర్ లో నటించారు.ఇక ఆ క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

సినిమా సూపర్ హిట్ అయింది.

Telugu Astrologist, Dakshayagnam, Vithalacharya, Nandamuritaraka, Senior Ntr, Sh

ఆ సినిమా 50 రోజుల ఫంక్షన్ విజయవాడలోని కనకదుర్గ కాళీ మందిరం హాల్ వద్ద నిర్వహించారు.క్రమం లోనే అన్నగారు చెన్నై బయలుదేరారు.అంత లోనే పెద్ద దుర్వార్త.

ఆయన పెద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ హఠాత్ మరణం.ఒకసారి ఆయన గుండె ఆగిపోయినంత పనైంది.

కట్ చేస్తే ఆ తర్వాత ఓ రోజు అన్నగారు విఠలాచార్య గారి ఇంటికి వచ్చారు.ఆ సమయంలో అక్కడే ఒక జ్యోతిష్కుడు కూడా ఉన్నారు.

అప్పటికే అన్న గారు పుత్ర శోకం లోనే ఉన్నాడు.ఆ సమయంలో ఇక అన్నగారికి జ్యోతిష్యుడు సంచలన విషయం చెప్పారు.

Telugu Astrologist, Dakshayagnam, Vithalacharya, Nandamuritaraka, Senior Ntr, Sh

మీరు పరమ శివుడి వేషం వేయడం కారణంగానే మీ అబ్బాయి హఠాత్ మరణం చెందాడు అని.ఇంకెప్పుడు.పరమ శివుడి వేషం వేయకండి అంటూ చెప్పారు అయితే మొదట ఎన్టీఆర్ ఈ విషయాన్ని నమ్మలేదు.కానీ ఆ తర్వాత దర్శకుడు విఠలాచార్య జ్యోతిష్యుడు గొప్పతనాన్ని చెప్పడంతో ఆ తర్వాత కాలంలో అన్నగారు దీని విశ్వసించారు.

దీంతో అప్పటి నుంచి ఏ సినిమాలో కూడా ఆయన పరమ శివుడి వేషం వేయలేదు.ఇక ఇలా అప్పట్లో శివుడి వేషం వేయాలంటూ కోట్ల రూపాయల ఆఫర్ లు వచ్చిన ఆయన మాత్రం తిరస్కరిస్తూ వచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube