విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు.అయితే ఈ బిరుదు ఆయనకు ఊరికి రాలేదు.
ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన విధానం.ప్రతి సినిమాకి చెమటోడ్చి పని చేసిన తీరు.
సినిమానే ఊపిరిగా బ్రతికిన ఆయన జీవితం ఆయనను నటసార్వభౌముడుగా మార్చేసింది.అప్పట్లో కేవలం హీరో పాత్రలే కాదు వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు ఎన్టీఆర్.
నెగెటివ్ పాత్రలు చేసినా తన నటనతో శభాష్ అంటూ ప్రశంసలు అందుకున్నారు.ఇక అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే ఓ వైపు హీరోగా మరోవైపు నెగటివ్ పాత్రలు కూడా చేసి ఏ హీరో చేయని పెద్ద సాహసమే చేశారు ఎన్టీఆర్.
ఇక ఇలా ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన సినిమాల ముచ్చట్లు ఇప్పుడు తెలుసుకుందాం.ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న మొదటి సినిమా లో మన దేశంలో ఇన్స్పెక్టర్ పాత్రలో నటిస్తాడు.
ఇక ఈ పాత్ర బ్రిటిష్ అధికారులు చెప్పింది తు.చ తప్పకుండా పాటిస్తూ ఉంటుంది.ఇక స్వాతంత్రోద్యమ సమయంలో భరతమాత సంకెళ్లను తెంచడానికి పోరాటం చేస్తున్న వారిని వారికి సపోర్ట్ చేస్తున్న వారిని లాఠీతో కొట్టిన పాత్రలో ఎన్టీఆర్ నటించారు.ఈ సినిమాలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం ప్రజల పట్ల దారుణంగా వ్యవహరించడం లాంటి సన్నివేశాలు కూడా ఉంటాయి.
ఇక దాదాపు ఏ హీరో కూడా ఇలాంటి పాత్రల్లో నటించడానికి సాహసం చేయరు కానీ ఎన్టీఆర్ మాత్రం పెద్ద సాహసం చేశారు.
అంతేకాకుండా గుడి గంటలు సినిమా లో ఎన్టీఆర్ హీరో.కానీ అందులో కూడా నెగటివ్ షేడ్స్ ఉండే సన్నివేశాలు ఎన్నో ఉంటాయి.ఇలా ఎన్నో పాత్రల్లో నెగటివ్ షేడ్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఎన్టీఆర్ ఇక ఆ తర్వాత మళ్లీ హీరోగా అవతారమెత్తి మల్లీశ్వరి పాతాళభైరవి లాంటి సినిమాల్లో మరోసారి హీరోగా ప్రేక్షకులను పలకరించారు.
ఇక ఆ తర్వాత రక్త సంబంధాలు, చిరంజీవులు, రాము లాంటి జానపద సినిమాల్లో కూడా నటించి మెప్పించారు.మరీ ముఖ్యంగా పౌరాణిక పాత్రలు అయినా దుర్యోధనుడు, రావణుడు లాంటి నెగిటివ్ షేడ్స్ లో నటించి పాత్రకి ప్రాణం పోయడం అంటే కేవలం అటు సీనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యం అయింది అని చెప్పాలి.
అంతేకాదు.రఘురామయ్య హీరోగా తెరకెక్కిన మాయా రంభ సినిమా లో ఎవరూ ఊహించని పాత్రలో నటించాడు ఎన్టీఆర్.ఇక ఈ పాత్రలో నటించేందుకు ఎవరూ ఒప్పుకోరు అని చెప్పాలి.ఎందుకంటే ఫేస్ కి నల్లటి రంగు తో పాటు చింపిరి జుట్టు చిరిగి పోయిన బట్టలతో నటించాల్సి ఉంటుంది.
ఇలాంటి పాత్రలు ఎంపిక చేసుకుని ఎన్టీఆర్ నటించటం అప్పట్లో సంచలనంగా మారింది.