టీడీపీ వైపు చూస్తున్న పురందరేశ్వరి ! బాబు రానిస్తాడా..?

ఎన్టీఆర్ కుమార్తెగా … కేంద్ర మంత్రిగా ఒక వెలుగు వెలిగిన దగ్గుపాటి పురంధరేశ్వరి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టలవైపు చూస్తున్నారు.ఆమె ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.

 Sr Ntr Daughter Purandeswari Wants To Join In Tdp Party-TeluguStop.com

ఆమె పార్టీ మారతారని అనుమానంతో … ఆమెకు ఎయిర్ ఇండియా డైరెక్టర్ పదవి కూడా కేంద్రం కట్టబెట్టింది.కానీ తన భవిష్యత్తు .తన వారసుడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆమె బీజేపీ నుంచి బయటపడాలని ఆలోచనలో ఉంది.టిడిపిలోకి రావడానికి అష్టకష్టాలు పడుతోంది.

ఏదో విధంగా టిడిపిలో చేరాలని తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోందట.దీని కోసం బంధువుల సహాయం కూడా తీసుకుంటోందని వార్తలు వస్తున్నాయి.

తమ కుటుంబం టిడిపిలోకి వస్తుందని, తన కుమారుడికి ‘పర్చూరు’ టిక్కెట్‌ ఇస్తే చాలునని.ఆమె కోరుతున్నారట.తనకు టిక్కెట్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా…కుమారుని రాజకీయ భవిష్యత్‌ కోసం అతనికి టిక్కెట్‌ ఇవ్వాలని ఇటీవల ఎన్టీఆర్’ కుటుంబీకులంతా ఒకచోట సమావేశమైనప్పుడు ఈ అంశంపైనే చర్చ జరిగిందని విశ్వసనీయంగా తెలిసింది.ప్రస్తుతం ‘పర్చూరులో ఉన్న టిడిపి ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.

అదే తన కుమారుడు అయితే సులువుగా విజయం సాధిస్తారని ఆమె చెప్పుకుంటోందట.ఇక పురందరేశ్వరి కుమారుడు కూడా తాను పోటీ అంటూ చేస్తే అది టీడీపీ నుంచేనని లేకపోతే రాజకీయాల్లోకి రానని చెప్పడంతో మరో మరో మార్గం లేక ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

అయితే.ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా…టిడిపి అధినేత చంద్రబాబు వైపు నుంచి రెస్పాన్స్ కనిపించడంలేదట.బంధువులు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తే చంద్రబాబు అంగీకరించే అవకాశం ఉంటుందనే ఆలోచనలో పురందరేశ్వరి ఉంది.ఈ విషయంలో తన తమ్ముడు బాలకృష్ణను ఎంటర్ చేసి రాయబారం పంపితే వర్కవుట్ అవుతుందనే ఆలోచనలో ఆమె ఉంది.

కానీ చంద్రబాబు ఈ విషయంలో మెత్తబడతాడా లేదా అనేది అందరికి సందేహమే.పోనీ వైసీపీ జనసేనలోకి వెళదామంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంత సేఫ్ కాదనే భావనలో ఆమె ఉంది.

ఇక చంద్రబాబు కోణంలో చూస్తే వీరి చేరికను వ్యతిరేకించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube