సీనియర్ ఎన్టీఆర్ ను.. చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు అన్న విషయం తెలుసా?

ఒక సాదాసీదా హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారు నందమూరి తారక రామారావు.హీరోగా మాత్రమే కాదు తన మంచితనంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

 Sr Ntr Childhood Unknown Facts, Sr Ntr , Childhood , Tollywood , Krishna Dist ,-TeluguStop.com

చిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా నందమూరి తారక రామారావు చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇక ఏదైనా పాత్రలో నందమూరి తారకరామారావు నటించారు అంటే ఇక ఆ పాత్రను ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరేమో అనేంతగా పాత్రల్లో ఒదిగిపోతూ ఉంటారు ఎన్టీఆర్.

డైలాగ్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు డాన్స్ స్టెప్పుల నుంచి యాక్టింగ్ వరకు ప్రతి విషయంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి.

కేవలం నటనలో మాత్రమే కాదు సినిమాల్లోని అన్ని రంగాల్లో కూడా నందమూరి తారకరామారావు ప్రావీణ్యం సంపాదించారు.

ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు దర్శకుడిగా కూడా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు.ఇంకోవైపు నిర్మాతగా కూడా మారి సత్తా చాటారు నందమూరి తారక రామారావు.జానపద, సాంఘిక, పౌరాణిక ఇలా చెప్పుకుంటూ పోతే నందమూరి తారకరామారావు చేయని సినిమా లేదు వేయని పాత్ర లేదు అని చెప్పాలి.ఇక ఆ తర్వాత సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి అడుగు పెట్టి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు ఆయన.ఆ తర్వాత ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు.

Telugu Childhood, Gudi Vada, Krishna Dist, Poltics, Sr Ntr, Tollywood-Latest New

ఇలా ఒక హీరోగా రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారకరామారావు గురించి ఒక వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.నందమూరి తారక రామారావును దత్తత తీసుకున్నారట.1923 మే 28వ తేదీన ఎన్టీఆర్ కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా నిమ్మకూరులో జన్మించారు.

Telugu Childhood, Gudi Vada, Krishna Dist, Poltics, Sr Ntr, Tollywood-Latest New

ఎన్టీఆర్ తండ్రి పేరు నందమూరి లక్ష్మయ్య చౌదరి, తల్లి పేరు నందమూరి వెంకట రామమ్మా.అయితే నందమూరి తారక రామారావు మామయ్య అత్తయ్య లకు పిల్లలు కాకపోవడంతో పెద్దమనసు చేసుకున్న ఎన్టీఆర్ తల్లిదండ్రులైన లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మా ఎన్టీఆర్ ని వారికి దత్తత ఇచ్చారట.ఈ క్రమంలోనే ఇక చిన్నప్పుడు నుంచి వారి పర్యవేక్షణలోనే పెరిగారట నందమూరి తారక రామారావు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube