మిస్సమ్మ సినిమా చేసేందుకు నో చెప్పిన సీనియర్ ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

నందమూరి తారక రామారావు. తెలుగు చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముడుగా ఆయన ప్రస్థానం ఎంతో ప్రత్యేకం.

 Sr Ntr And Missamma Movie Unknown Facts Details, Senior Ntr, Missamma Movie,nand-TeluguStop.com

అయితే ఇక నటసార్వభౌముడు స్థాయికి ఎదగడానికి అందరి నటుల లాగానే ఎన్నో కష్టాలు పడ్డారు సీనియర్ ఎన్టీఆర్.అప్పట్లో అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగారు.

ఇలా ఎన్టీఆర్, అక్కినేని, మిక్కిలినేని అందరూ కూడా రూమ్మేట్లుగా ఉంటూ సినిమా చాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండేవారట.ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ కు వరుస అవకాశాలు రావడంతో ఎంతగానో బిజీగా మారిపోయారు.

ఇలా అన్నగారు వరుసగా సినిమా షూటింగులో పాల్గొంటున్న సమయంలోనే ఇక అన్న గారి కెరీర్ను మలుపు తిప్పే మిస్సమ్మ అనే సినిమా ఆఫర్ వచ్చింది.అయితే ఇక మొదట ఈ సినిమాను అన్నగారు తిరస్కరించాడట.

ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.అయితే అప్పట్లో హీరోలకు పారితోషికం ఉండేది కాదు.

విజయ వాహిని అనే స్టూడియోలో అన్నగారు 120 రూపాయల జీతానికి పని చేసేవారు.అచ్చంగా ఉద్యోగం లాగానే సంస్థ ఏది చెబితే అది చేయాల్సిందే.

కానీ ఇక మిస్సమ్మ సినిమా కథను ఎల్.వి.ప్రసాద్ ఎన్టీఆర్ దగ్గరకు తీసుకువెళ్తే చేయను అని చెప్పేశారట.

అయినా హీరో హీరోయిన్ ను బ్రతిమిలాడడం ఏంటి.

ఇలాంటి పాత్రలు చేస్తే పేరు పోతుంది అని సమాధానం చెప్పారట ఎన్టీఆర్.

Telugu Lv Prasad, Mikkilineni, Missamma, Nandamuritaraka, Senior Ntr, Sr Ntr-Mov

అయితే ఎన్టీఆర్ సమాధానం పై విస్మయానికి గురి అయినా ఎల్.వి.ప్రసాద్ ఇక ఈ సినిమా ఎంతో గొప్ప విజయం సాధిస్తుంది అన్న విషయాలను మాటల్లో వివరించారట.ఇలా బ్రతిమిలాడినా సన్నివేశాలే నీకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా చేస్తాయ్ అంటూ ధీమా ఇవ్వడంతో ఇక అన్నగారు మిస్సమ్మ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు.ఇక ఆ తర్వాత ఈ సినిమా నిజంగానే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

ఎల్.వి.ప్రసాద్ చెప్పినట్లుగానే ఎన్టీఆర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.దాదాపు 365 రోజుల ఫంక్షన్ చేసుకుంది మిస్సమ్మ సినిమా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube