ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయిన ఎస్.ఆర్.కళ్యాణ మండపం మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్

రాజావారు రాణిగారు సినిమాతో డీసెంట్ హిట్ ని ఖాతాలో వేసుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం.ఈ హీరో ప్రస్తుతం ఎస్.

 Sr Kalyana Mandapam Worldwide Rights Sold Out-TeluguStop.com

ఆర్.కళ్యాణ మండపం అనే మూవీని చేసిన సంగతి తెలిసిందే.ఎలైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కింది.రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీని ఆవిష్కరించారు.శ్రీధర్ గాదె ఈ మూవీతో దర్శకుడుగా పరిచయం అవుతూ ఉండగా ప్రియాంకా జువాల్కర్ హీరోయిన్ గా నటించింది.ఇక సాయి కుమార్ మూవీలో ఓ కీలక పాత్రలో నటించాడు.

ఇదిలా ఉంటే ఇప్పటికే మూవీ టీజర్, సాంగ్స్ రిలీజ్ అయ్యి అందరిని ఆకట్టుకున్నాయి.దీంతో సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది.

 Sr Kalyana Mandapam Worldwide Rights Sold Out-ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయిన ఎస్.ఆర్.కళ్యాణ మండపం మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.

Telugu Kiran Abbavaram, Priyanka Jawalkar, Sr Kalyana Mandapam, Tollywood-Movie

ఇదిలా ఉంటే ఈ మూవీ వరల్డ్ వైడ్ రైట్స్ అమ్ముడుపోయినట్లు నిర్మాతలు తెలియజేశారు.శంకర్ పిచర్స్ వారు ఎస్.ఆర్.కళ్యాణ మండపం రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు.దీంతో ఈ సినిమాని భారీ ఎత్తున ప్రమోట్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం దీని తర్వాత మరో మూడు సినిమాలని లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది.అందులో ఒక సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కూడా అయ్యింది.

మొత్తానికి షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసిన ఈ కడప కుర్రాడు సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ యంగ్ హీరోల జాబితాలోకి దూసుకోచ్చేస్తున్నాడని దీనిని బట్టి అర్ధమవుతుంది.

#Kiran Abbavaram #SRKalyana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు