తండ్రి కొడుకులు కలిసి చూడాల్సిన సినిమా ఇది!

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా తెరకెక్కించాలంటేనే ఎంతో కష్టంతో కూడుకున్నది.అలాంటివి సినిమా తెరకెక్కించి ఆ సినిమా థియేటర్లో విడుదల చేయాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంది.

 Sr Kalyana Mandapam This Is A Movie That Father And Son Should Watch Together-TeluguStop.com

ఈ విధంగా సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఆ కష్టాలను అధిగమిస్తూ ఎట్టకేలకు థియేటర్ లో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’.శ్రీధర్ గాదె దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా ఆగస్టు 6న థియేటర్ లోకి రావడం చేత చిత్రబృందం హైదరాబాదులో ముందస్తు వేడుకలను నిర్వహించారు.

 Sr Kalyana Mandapam This Is A Movie That Father And Son Should Watch Together-తండ్రి కొడుకులు కలిసి చూడాల్సిన సినిమా ఇది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు తరుణ్ భాస్కర్, అవసరాల శ్రీనివాస్, హీరో అల్లరి నరేష్, హీరో రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.ఈ వేడుకలో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ… ఈ సినిమాను ఒక మధ్యతరగతి వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించామని, ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఏ విషయంలోనూ భయపడకుండా, అన్ని సాధించాలనే కాన్సెప్టుతో తెరకెక్కించినట్లు తెలిపారు.

Telugu Abbavaram, Allari Naresh, Avasarala Srinivas, Familymovie, Hyderabad, Priyanka, Releasing In Theaters, Sai Kumar, Sr Kalyana Mandapam, Tollywood-Movie

ఈ సినిమా మొత్తం ఒక కళ్యాణ మండపం చుట్టూ తిరుగుతుందని, ఈ క్రమంలోనే తండ్రీ కొడుకుల మధ్య ఉన్న గొప్పతనం ఎంతో అద్భుతంగా చూపించామని తెలిపారు.ఈ సినిమా తండ్రి కొడుకులిద్దరు కలిసి చూసే సినిమా అని దర్శకుడు తెలిపారు.ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో సాయి కుమార్ కీలక పాత్రలో నటించారు.

#Hyderabad #ReleasingIn #Abbavaram #Familymovie #Allari Naresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు