ఇంత అతిగా హీరోయిన్ రెమ్యునరేషన్ పెరగడానికి నిర్మాతలే కారణం.. సీనియర్ జర్నలిస్ట్ కామెంట్స్?

Sr Journalist Giridhar Sensational Comments About Heroines Remuneration

సీనీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అందరూ డబ్బు కంటే అక్కడ నిలదొక్కుకునేందుకు ప్రాధానత్య ఇస్తారు.అందుకే తొలినాళ్లలో రెమ్యునరేషన్ నిర్మాతలు ఎంతిస్తే అంత తీసుకుని బ్రేక్ కోసం ఎదురు చూస్తుంటారు.

 Sr Journalist Giridhar Sensational Comments About Heroines Remuneration-TeluguStop.com

ఒక్కసారి సరైన హిట్ పడిదంటే చాలు రేటు పెంచేస్తారు.ఈ విషయంలో హీరోయిన్లు ముందు వరుసలో ఉంటారు.

అయితే గతంలో హీరోయిన్లు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉండేవారు.కరోనా పరిస్థితుల కారణంగా ఇటీవల రెమ్యునరేషన్లలో కోత విధించుకోవాలని ఇండస్ట్రీ పెద్దలు నిర్ణయించారు.

 Sr Journalist Giridhar Sensational Comments About Heroines Remuneration-ఇంత అతిగా హీరోయిన్ రెమ్యునరేషన్ పెరగడానికి నిర్మాతలే కారణం.. సీనియర్ జర్నలిస్ట్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయినప్పటికీ కొంతమంది హీరోయిన్లు పారితోషికం విషయంలో తగ్గడం లేదని టాక్.

ఇదిలా ఉండగా హీరోయిన్లు ఇలా వారి రెమ్యునరేషన్లు పెంచడానికి వారి మేనేజర్లే కారణం అనే కొందరి వాదన.

ఈ విషయంలో తెలుగు ఇండస్ట్రీలో కంటే బాలీవుడ్‌ కథానాయికలు మరింత ముందంజలో ఉండడం అందరికీ తెలిసిన విషయమే.అయినప్పటికీ తమ విజయాలు, డిమాండ్‌ని బట్టి కొంతమంది స్టార్ హీరోయిన్లకు కూడా బాగానే రెమ్యునరేషన్‌ అందుతుండడం మరో విషయం.

సినిమాల్లో హీరోయిన్రెమ్యునరేషన్లు భారీ ఎత్తున పెరిగిపోవడానికి కారణం వారు అపాయింట్ చేసుకున్న మేనేజర్లే, కారణమని సినీ పరిశ్రమలో కొంత వరకు టాక్.

Telugu Heroine Managers, Heroines Remuneration, Remunerations, Senior Journalist Giridhar, Sensational Comments, Sr Journalist Giridhar, Tollywood-Movie

కానీ నిజం చెప్పాలంటే వారి రెమ్యునరేషన్లు పెరగడానికి ముఖ్య కారణం ప్రొడ్యూసర్లే అసలు కారణం అని సీనియర్ జర్నలిస్ట్ గిరిధర్ బట్టబయలు చేశారు.ఎందుకంటే ప్రస్తుతం ట్రెండింగ్, అంటే ఎక్కువ పాఫులారిటీ ఉన్న హీరోయిన్ల డేట్స్ కావాలంటే ఎవకు ఎక్కువ రెమ్యురేషన్ ఆఫర్ చేస్తే వాళ్లకు ఓకే చెప్తారని ఆయన అన్నారు.కానీ దానిక్కారణం మేనేజర్లు కాదని ఆయన స్పష్టం చేశారు.

వర్క్ సజావుగా జరగడానికి మేనేజర్ కారణం అవుతాడన్న ఆయన, అటు ప్రొడ్యూసర్‌ని, ఇటు ఆర్టిస్ట్‌ని ఇద్దరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ షూటింగ్ సక్రమంగా జరగడానికి మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తారని ఆయన వివరించారు.అది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ, వాళ్లపై అలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

కానీ అది నిజం కాదని ఆయన తెలిపారు.

Telugu Heroine Managers, Heroines Remuneration, Remunerations, Senior Journalist Giridhar, Sensational Comments, Sr Journalist Giridhar, Tollywood-Movie

కొందరు హీరోయిన్లు మేనేజర్ మాటలు వినరు అనే అంశంపై స్పందించిన ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.నిజం చెప్పాలంటే అలాంటి సంఘటనను ఒకదాన్ని వివరిస్తూ, ఒకసారి ఒక హీరోయిన్ కూడా అలానే చాశారని అసలు విషయం బయట పెట్టారు.ఆ అమ్మాయి ఏకంగా బెంజ్ కారు కావాలని కండీషన్ పెట్టినట్లు ఆయన తెలిపారు.

అప్పుడు ఏం చేయలేం కదా ? ఇంకా డిమాండ్ ఉంది కాబట్టి కొంతమంది అలానే చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు.

#Managers #SrJournalist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube