ఒకప్ప్పటి కంటే కూడా ఇప్పుడు కాలం చాలా మారిపోయింది.వేసుకునే బట్టల్లో అయితే ఫ్యాషన్ రంగం ఓ సంచలనమే సృష్టించింది.
రోజురోజుకు కొత్త రకమైన వెరైటీ బ్రాండ్లు దర్శనమిస్తున్నాయి.అయతే చాలా కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకునేందుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
ఏదో రకంగా తమ బట్టలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే ఇప్పుడు జంతువులకు కూడా ఫ్యాషన్ బట్టలు వేయడం మనం చూస్తున్నాం.
పెంపుడు కుక్కలు, పిల్లులకు ఇలాంటి ఫ్యాషన్ బట్టలు బాగా అలవాటు చేస్తున్నారు.
ఇలాంటి జంతువులకు కొత్త రకమైన బట్టలను డిజైన్ చేసేందుకు ఇప్పుడు చాలా కాంపెనీలు ముందుకు వస్తున్నాయి.
ఇలాంటి డిజైన్లు బాగా ట్రెండ్ కావడంతో కేవలం కుక్కలు, పిల్లులకే వీటిని పరిమితం చేస్తే ఎలా అనుకున్నారో ఏమో తెలీదు గానీ ఇప్పుడు ఉడుములకు, సరీసృపాలకు కూడా ఇలాంటి ఫ్యాషన్ బట్టలను వేసేస్తున్నారు.అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ ఇప్పుడు ఇలాంటి డేరింగ్ స్టెప్ వేసి అందరినీ షాక్కు గురి చేసింది.ఆ బ్రాండ్లు ఇప్పటికే మనుషుల బట్టల్లో చాలా ఫేమస్.
అయితే ఇప్పుడు మరింత ఫేమస్ అయ్యేందుకు సరసృపాలకు కూడా డిజైన్ చేసేసింది.
తొండలు, ఉడుములకు కూడా చాలా స్టైల్ గా ఉండే బట్టలను డిజైన్ చేసి వావ్ అనిపించేసింది.
ఇందుకు సంబంధించిన కొన్ని డిజైన్ల బట్టలతో పాటు వాటికి కండ్లజోడు, టోపీలను కూడా అందించింది.కాగా ఈ సరీసృపాల కోసం డిజైన్ చేసిన బట్టలు ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
వీటిని చూసిన నెటిజన్లు తమదైన స్టైల్ లో సెటైర్లు వేస్తున్నారు.మాక్కూడా ఇలాటివి డిజైన్ చేయండంటూ ఇంకొందరు కామెంట్లు కూడా పెడుతున్నారు.మొత్తానికి ఇలా తలా ఓ విధంగా స్పందిస్తున్నారు.