ఎప్పుడైతే స్టార్మ్ ఫోన్ల వినియోగం పెరిగిందో అప్పటి నుంచే సోసల్ మీడియా ఎక్కువగా వాడకంలోకి వచ్చేసింది.ఇందులో ఎక్కువగా వైరల్ కంటెంట్ కే నెటజిన్లు మొగ్గు చూపుతుంటారు.
ప్రపంచంలో ఏ మూలన ఏమన్నా జరగనీ వెంటనే దాన్ని సోషల్ మీడియాలో ప్రవేశ పెట్టి అందరికీ తెలియజేయడమే ఇప్పుడున్న ట్రెండ్.ఇక జంతువులకు సంబంధించిన వైరల్ కంటెంట్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.
మొదటి నుంచి ఇలాంటి వీడియోలకు నెట్టింట ఆదరణ బాగానే లభిస్తోంది.ఇకపోతే ఇప్పుడు కూడా ఓ డిఫరెంట్ కంటెంట్ వీడియో వైరల్ అవుతోంది.
సాధారణంగా మనం పాము, ముంగీసల పోరాటాన్ని చూశాం.అంతేగానీ పాము, ఉడుత పోరాటాన్ని ఎపపుడూ చూడలేదు కదా.ఏంటి పాము, ఉడుతలు కూడా పోరాడుకుంటాయా అనే అనుమానం వస్తోంది కదా కానీ ఇదే నిజమండి ఇప్పుడు మనం చూడబోయే వీడియో ఇలాంటిదే.తన బిడ్డను కాపాడుకునేందుకు ఓ ఉడుత ఏకంగా నాగుపాముతో సమరానికి సై అంటుంది.
పాము జోలికి పోతే తన ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఉడుత మాత్రం భయపడకుండా పిల్లలకు ప్రమాదం జరగకూడదని తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతుంది.
తన పిల్లలను తినేందుకు వచ్చిన పాముతో ఆ ఉడుత సాగించిన పోరాటంతో పాముకు చుక్కలు చూపిస్తుంది.తన అద్భుతమైన పోరాటంతో ఆ నాగుపాముకు ముప్పుతిప్పలు పెడుతుంది ఉడుత.ఇక ఉడుతను ఎలాగైనా కాటు వేసి తినేయాలని ప్రయత్నించినా పాము వల్ల కాక చివరుకు ఉడుత నుంచి తప్పించుకుని పారిపయే పరిస్థితి వస్తుంది.
కాగా ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో పోస్టు చేయగా విపరీతంగా వైరల్గా మారింది.దీన్ని చూసిన వారంతా కూడా ఉడుత పోరాటాన్ని మెచ్చుకుంటున్నారు.తల్లి ప్రేమకు ఏదీ సాటిరాదంటూ కామెంట్లు పెడుతున్నారు.