స్క్విడ్ గేమ్ వెబ్ సీరీస్ అద్భుతమైన రికార్డ్..!

వెబ్ సీరీస్ హిస్టరీలో స్క్విడ్ గేమ్ సృష్టిస్తున్న అద్భుతాలు అన్ని ఇన్నీ కావు.నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సీరీస్ వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తుంది.

 Squid Game Web Series Watch Hours World Record , Hollywood , Latest Movie News ,-TeluguStop.com

వెబ్ సీరీస్ ఖాతాలో మరో రికార్డ్ నెలకొంది.వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు ఏ వెబ్ సీరీస్ చూడని వాచ్ అవర్స్ ఈ వెబ్ సీరీస్ కు వచ్చాయి.తెలుస్తున్న సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్ లో ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సీరీస్ ను 1.65 బిలియన్ గంటలు వాచ్ అవర్స్ జరిగాయట.అంటే మన లెక్కల్లో చెప్పాలంటే 1.82 వేల సంవత్సరాలని తెలుస్తుంది.

ఇది వరల్డ్ వైడ్ వెబ్ సీరీస్ లలో ఏ వెబ్ సీరీస్ కూడా సాధించలేని ఘనత అని చెప్పొచ్చు.కొరియన్ భాషలో తెరకెక్కిన ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సీరీస్ హాగ్ డాంగ్ హ్యుక్ డైరెక్ట్ చేశారు.

స్క్విడ్ గేమ్ సూపర్ సక్సెస్ అవడంతో దీనికి పార్ట్ 2 కూడా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.స్క్విడ్ గేం వెబ్ సీరీస్ ఇండియాలో కూడా మంచి వాచ్ అవర్స్ ను సంపాదించింది.

ఇక్కడ కూడా ఆ వెబ్ సీరీస్ ఫ్యాన్స్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube