'స్పై' ఇంట్రో గ్లింప్స్.. డాషింగ్ లుక్ లో హంటింగ్ స్టార్ట్ చేసిన నిఖిల్!

నిఖిల్ సిద్దార్థ్ హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ నటనలో తనను తాను నిరూపించు కుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక అతడి కెరీర్ లో కార్తికేయ సినిమా ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అయితే మధ్యలో వరుస ప్లాపులు రావడంతో ఈయన రేస్ లో వెనుక బడ్డాడు.అయితే మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.

ప్రెసెంట్ నిఖిల్ నటిస్తున్న సినిమాల్లో 18 పేజెస్ ఒకటి.ఈ సినిమాను కుమారి 21F సినిమా ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్నాడు.

అలాగే నిఖిల్ కార్తికేయ 2 సినిమా కూడా చేస్తున్నాడు.అలాగే ఇటీవలే తన మొదటి పాన్ ఇండియా సినిమాను ప్రకటించి యంగ్ హీరోగా తాను కూడా పాన్ ఇండియా రేస్ లో ఉన్నానంటూ చెప్పకనే చెప్పేసాడు.

Advertisement

ఇక అలా మొదలు పెట్టారో లేదో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ మూవీకి ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించ నున్నారు.

ఈ సినిమాకు స్పై అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు.ఈ సినిమాను దసరా కానుకగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తుండగా.

ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా ఐశ్వర్య మీనన్ నటిస్తుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఇంట్రో గ్లింప్స్ రిలీజ్ చేసారు.ఇందులో మంచు పర్వతాల మీద నడుస్తున్న హీరో చివరకు అక్కడే ఆయుధాలతో నిండి ఉన్న రహస్య ప్రదేశాన్ని కనిపెట్టి అందులో ఉన్న తుపాకీలతో హంటింగ్ స్టార్ట్ చేసిన చిన్న వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేసి మరిన్ని అంచనాలను పెంచేశారు.నిఖిల్ తుపాకీలను పట్టుకుని బైక్ నడుపుతూ కనిపించదు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

ఈ వీడియోతోనే ఇది ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా అని అర్ధం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు