వెల్లుల్లికి మొలక వస్తే.....ఎన్ని లాభాలో తెలుసా?     2016-08-25   01:01:46  IST  Lakshmi P

సాధారణంగా మనం వెల్లుల్లి పాయ మొలక వస్తే పారేస్తూ ఉంటాం. కానీ ఆలా మొలక వచ్చిన వెల్లుల్లిపాయలో మాములు వెల్లుల్లిపాయలో కన్నా ఎక్కువ గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ క్రియాశీలంగా ఉంటాయని నిపుణులు చెప్పుతున్నారు. లేత పాయలు,కాస్త ముదిరిన పాయలతో పోలిస్తే మొలక వచ్చిన పాయలలో రకరకాల మెటాబోలెట్స్ అధికంగా ఉంటాయి.

సాధారణంగా ఈ మెటాబోలెట్స్ గింజల మొలకల్లో కనిపిస్తాయి. మొక్కలుగా మారే దశలో ఆయా మొలకలు వ్యాధుల బారిన పడకుండా ఈ మెటాబోలెట్స్ కాపాడతాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గా అద్భుతంగా పనిచేస్తాయి. మాములు వెల్లుల్లి పాయలు కన్నా మొలక వచ్చిన వెల్లుల్లి గుండెకు మేలు చేస్తాయి. కొలస్ట్రాల్,బిపి ని తగ్గించటంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.