ఉల్లికాడలను తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా   Spring Onions Health Benefits     2018-03-25   00:13:32  IST  Bhanu C

ఉల్లికాడలను కొత్తిమీర‌, పుదీనా త‌ర‌హాలోనే కూరల్లో,పులావ్,ఫ్రైడ్ రైస్ వంటి వాటిల్లో వేసుకుంటారు. అయితే దీని రుచి అందరికి నచ్చదు. అందువల్ల కొంతమంది మాత్రమే ఉల్లికాడలను తినటానికి ఇష్టపడతారు. అయితే ఉల్లికాడలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు మానకుండా తినటానికి ప్రయత్నం చేస్తారు. ఉల్లికాడలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అయితే ఇప్పుడు ఉల్లికాడలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఉల్లికాడలు రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాక రక్త సరఫరాను మెరుగుపరచి రక్తపోటు రాకుండా కాపాడుతుంది.

ఉల్లికాడలను తరచుగా తింటూ ఉంటే రక్తంలో చక్కర స్థాయిల స్థిరీకరణ జరిగి మధుమేహం అదుపులో ఉంటుంది.

ఉల్లికాడల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ లక్షణాలు ఉండుట వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా కాపాడతాయి.

జీర్ణక్రియను బూస్ట్ చేయటం వలన గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి సమస్యలు రావు. అలాగే కీళ్లనొప్పులు ఉన్నవారు కూడా ఉల్లికాడలను తింటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

ఆస్తమా ఉన్నవారికి ఉల్లికాడలు చాలా మేలు చేస్తాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గుతాయి. య‌వ్వ‌నంగా కనిపిస్తారు.