బాయ్ ఫ్రెండ్ తో పరదేశంలో నయనతార రొమాన్స్     2017-09-18   06:12:46  IST  Raghu V

-

-

లేడి సూపర్ స్టార్ నయనతార చాలా బలమైన మనస్తత్వం కలిగిన మహిళ. జీవితంలో ఒకసారి ప్రేమలో ఓడిపోతే చాలు, ఇక ప్రేమవద్దు, గుండెకి మళ్ళీ గాయం చేసుకోవడం వద్దు అంటూ డీలాపడిపోతారు ఎంతోమంది. నయనతారకి ఒకసారి కాదు, రెండుసార్లు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. రెండుసార్లు ఆమె మనసుకి గాయమయ్యింది‌. ఒకసారి తమిళ నటుడు శింబుతో ప్రేమాయణం నడిపించి వార్తల్లో కనిపించిన నయన్, ఆ తర్వాత అతనితో తెగతెంపులు చేసుకుంది. ఆ ప్రేమకథ ఒక ఎత్తైతే, దర్శకుడు ప్రభుదేవాతో నడిచిన ప్రేమకథ మరోక ఎత్తు.

-

ఈసారి ప్రభుదేవాతో పెళ్ళి కలలు కూడా కనింది నయన్. తనకోసమని క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతంలోకి మారింది కూడా. కాని కారణాలు బయటకి తెలియకుండా వీరి బంధానికి ఫుల్ స్టాప్ పడింది‌. ఇలా రెండుసార్లు తనని గాయపర్చినా, నయనతార ప్రేమ కోసం వెతుకులాట మానలేదు. మొత్తానికి తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది నయన్.

ఇన్నాళ్ళు చాటుమాటుగా సాగిన వీరి వ్యవహారం ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. 18వ సెప్టెంబరు విఘ్నేష్ పుట్టినరోజు. దాంతో నయనతార స్పేషల్ పార్టీ ప్లాన్ చేసి తన బాయ్ ఫ్రెండ్ తో పాటు అమెరికా చెక్కేసింది‌. అక్కడే ఈ జంట బర్త్ డే సంబరాలు జరుపుకుంటున్నారు. విఘ్నేష్ వయసులో నయన్ కంటే ఓ సంవత్సరం చిన్నవాడు కావడం విశేషం.