నీ భర్త క్రికెట్ ఆడకుండా నీ బ్యాగులు మోస్తున్నాడా.. అంటూ క్రికెటర్ భార్యని....

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు దాదాపుగా అందరికీ అందుబాటులోకి రావడంతో సెలబ్రెటీలకి మరియు సామాన్య ప్రజలకు దూరం బాగా తగ్గిపోయిందని చెప్పవచ్చు.అయితే కొంతమంది మాత్రం నిజానిజాలు తెలుసుకోకుండా చేసేటటువంటి పనులు మరియు కామెంట్ల కారణంగా ఒక్కోసారి సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.

 Sports Anchor Mayanti Langer Strong Reply To The Netizen-TeluguStop.com

కాగా తాజాగా భారత ప్రముఖ క్రికెటర్ భార్యతో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తన భర్త గురించి వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ గా సేవలు అందించిన ప్రముఖ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ గత కొద్ది కాలంగా పేలవ ఫామ్ కారణంగా పెద్దగా రాణించలేక పోతున్నాడు.

 Sports Anchor Mayanti Langer Strong Reply To The Netizen-నీ భర్త క్రికెట్ ఆడకుండా నీ బ్యాగులు మోస్తున్నాడా.. అంటూ క్రికెటర్ భార్యని….-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో దాదాపుగా ఆరేళ్లుగా భారత జట్టులో స్థానం దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.దీంతో కొందరు నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాలలో స్టువర్ట్ బిన్నీ గురించి నెగిటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు.

కాగా ఇటీవలే స్టువర్ట్ బిన్నీ భార్య మయంతి లాంగర్ తన ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా  లైవ్ కార్యక్రమం నిర్వహించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

ఈ క్రమంలో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నీ భర్త క్రికెట్ ఆడకుండా నీ బ్యాగులను మొస్తున్నాడా.? అంటూ కొంతమేర వ్యంగంగా కామెంట్ చేశాడు.దీంతో మయంతి లాంగర్ తనదైన శైలిలో స్పందిస్తూ క్రికెట్ గురించి ఏ మాత్రం తెలియని వాళ్లు చేసే కామెంట్ల గురించి తాను అసలు పట్టించుకోనని రిప్లై ఇచ్చింది.

దీంతో మయంతి లాంగర్ చేసిన పనికి కొందరు నెటిజన్లు అభినందిస్తున్నారు. అంతేకాక ఈ మధ్య  కొందరు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను సృష్టించి సెలబ్రిటీల గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అలాంటి వారికి ఇలాగే బుద్ధి చెప్పాలని అభి ప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఒకప్పుడు స్పోర్ట్స్ ఛానల్స్ లో హోస్ట్ గా వ్యవహరించి తన గల గల మాటలతో ఏంతగానో ఆకట్టుకున్న మయంతి లాంగర్ ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను చక్కదిద్దే పనిలో పడింది. అంతేకాక ఇటీవలే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో కొంత కాలంగా తన వృత్తికి బ్రేక్ ఇచ్చింది.

కాగా ప్రస్తుతం మయంతి న్యూ ఢిల్లీలో తన భర్తతో కలిసి నివాసముంటున్నట్లు సమాచారం.

#Stuart Binny #Mayanti Longer #SportsAnchor #Sports Anchor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు