చోద్యం :పిచ్చోడి కడుపులో వైధ్యులు గుర్తించిన వస్తువులు ఏంటో తెలిస్తే కళ్లు తిరిగి పడిపోతారు  

Spoons Knife Screwdrivers Toothbrushes Recovered From The Stomach Of Man-screwdrivers,spoons Knife,stomach,toothbrushes,కరణ్‌ సేన్‌,హిమాచల్‌ ప్రదేశ్‌

మామూలుగా మనం కడుపులోకి చిన్న వస్తువు ఏదైనా మింగితేనే తెగ ఇబ్బంది పడతాం. చిన్న కాయిన్‌ను పిల్లలు మింగితే నానా హంగామా చేస్తాం. పిల్లల ప్రాణాలకు ఎక్కడ ప్రమాదం వస్తుందో అంటూ వెంటనే వైధ్యుల వద్దకు తీసుకు వెళ్తాం..

చోద్యం :పిచ్చోడి కడుపులో వైధ్యులు గుర్తించిన వస్తువులు ఏంటో తెలిస్తే కళ్లు తిరిగి పడిపోతారు-Spoons Knife Screwdrivers Toothbrushes Recovered From The Stomach Of Man

కాయిన్స్‌ మాత్రమే కాకుండా పిల్లలు పేపర్‌ తిన్నా మరేదైనా తిన్నా కూడా వెంటనే తల్లిదండ్రులు స్పందించి చాలా సీరియస్‌గా వైధ్యులకు చూపిస్తారు. కాని పిల్లల విషయంలో కాకుండా పెద్దల విషయంలో అలా జరిగింది. ఒక పిచ్చివాడి కడుపులో వైధ్యులు ఆశ్చర్యకర వస్తువులు గమనించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఒక మానసిక రోగి రోడ్లమీద తిరుగుతూ జీవనం గడిపేస్తున్నాడు.

అతడు కంటికి కనిపించింది తింటూ, అనిపించింది తాగేస్తూ జీవితంను గడుపుతున్నాడు. 35 ఏళ్ల వయసు ఉన్న కరణ్‌ సేన్‌ అనే ఆ మానసిక రోగి తాజాగా విపరీతమైన కడుపు నొప్పితో బాధ పడ్డాడు. అతడు తన బాధను వ్యక్తం చేయలేక గట్టి గట్టిగా మొత్తుకుంటూ ఉండటం స్థానికులు గమనించారు. అతడిని ఆంబులెన్స్‌లో స్థానిక హాస్పిటల్‌కు తీసుకు వెళ్లడం జరిగింది.

హాస్పిటల్‌ డాక్టర్‌లు అతడికి ఎక్స్‌రే తీయగా కడుపులో ఆశ్చర్యకరంగా వింత వింత వస్తువులు కనిపించాయి. ఆ వస్తువులు తీసేందుకు ఆపరేషన్‌ చేశారు. ఆ పరేషన్‌ చేసిన తర్వాత వైధ్యులు అతడి కడుపు నుండి స్పూన్లు, స్క్రూ డ్రైవర్లు, టూత్‌ బ్రష్షులు, కిచెన్‌ నైఫ్‌లు తీయడం జరిగింది. ఆ వస్తువులను చూసి వైధ్యులు అవాక్కయ్యారు.

సామాన్యులు ఈ విషయం తెలిస్తే కళ్లు తిరిగి పడిపోవడం ఖాయం. ఇన్ని వస్తువులు కడుపులో పెట్టుకుని ఇన్నాళ్లు ఎలా బతికేశాడో కదా.?