రెండుగా చీలిపోయి.. కింద స‌పోర్టు లేకుండా ఉంటున్న బండ‌రాయి..

ఈ అనంత సృష్టిలో ఎన్నో ఆకారాలు నిక్షిప్త‌మ‌యి ఉన్నాయి.ఎన్నో ప్ర‌కృతి అందాల‌కు ఈ భూమి నెల‌వు.

 Split In Two A Rock That Stays Without Support Underneath, Underneath, Viral New-TeluguStop.com

అలాంటి అందాల‌ను తనివి తీరా చూడాలంటే మ‌న‌కున్న రెండు కండ్లు కూడా స‌రిపోవేమో అనిపిస్తుంది.ఇక‌పోతే ఇప్పుడు కూడా ఓ వింత గురించి మ‌నం తెలుసుకోబోతున్నాం.

దీన్ని చూసిన త‌ర్వాత సృష్టి అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది.ఇలాంటి వింత ఆకారాలు శాస్త్రవేత్తలకు గానీ లేదా సైన్స్ కుకూడా అంద‌ట్లేదు.

అవి ఇప్ట‌పికీ పెద్ద స‌వాళ్ల‌ను విసిరే పజిల్స్‌గానే మిగిలిపోయాయి.ఇప్ప‌టికే మ‌నం ఇలాంటి చాలా ర‌కాల వింత‌ల గురించి వింటున్నాం.

ఇందులో సముద్రం మధ్య మంచినీటి బావి ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.దాంతో పాటే రంగు మార్చుకోగలిగిన సరస్సు లాంటి వింతలు ఎన్నో ఉన్నాయి.ఇక‌పోతే ఇప్పుడు ఓ పురాతన బండరాయి గురించి తెలుసుకుందాం.అస‌లు ఒక రాయిని స‌మాంత‌రంగా విడ‌గొట్టాలంటే ఎంత క‌ష్ట‌మో తెలిసిందే.

దాన్ని కొల‌త‌ల ప్ర‌కారం మిషిన్ల న‌డుమ క‌ట్ చేస్తే గానీ అంత స‌మాంతరంగా రాదు.కానీ ఓ బండ రాయి మాత్రం పునాది బలంగా లేకున్నా కూడా రెండు స‌మాంత‌ర భాగాలుగా విడిపోయిందంటే అస్స‌లు న‌మ్మ‌లేం.

ప్ర‌స్తుతం ఈ బండ‌రాళ్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమ‌స్‌.

Telugu Al Nasla Rock, Arabia, Thousand, Natural, Tamya Oasis-Latest News - Telug

వీటిని చూసేందుకు ప‌ర్యాట‌కులు త‌ర‌లివ‌స్తుంటారు.దీని పేరు అల్ నస్లా. ఈ బండ‌రాయికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీనికి అస‌లు పునాది బలం లేకున్నా స‌మాంత‌రంగా విడిపోయి అస్స‌లు కింద పడిపోకుండా ఉండ‌టం.

అస‌లు ఒక‌రాయి కింద పునాది లేకుండా గాల్లో ఉండ‌టం అసాధ్యం.కానీ ఇప్పుడు తెలుసుకుంటున్న బండ‌రాయి మాత్రం అరేబియాలోని తమ్యా ఒయాసిస్ ఏరియాలో ఉంది.ఇది దాదాపుగా 4 వేల ఏళ్ల క్రితం నిర్మిత‌మైన పురాతనమైన రాయిగా గుర్తింపు పొందింది.30 అడుగుల పొడువులో ఉన్న ఈ రాయి ఇప్పుడు వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube