పుష్ప పాటకు స్పైడర్ మ్యాన్ స్టెప్పులు... డ్యాన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమా గత నెల డిసెంబర్ 17న థియేటర్లలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన విషయం తెలిసిందే.

 Spider Man Steps For Pushpa Rashmika Rara Sami Song Details, Pushpa, Spider Man,video Viral, Rashmika Mandanna, Spider Man Dance Steps, Rashika Mandanna, Pushpa Song, Ra Ra Sami Song, Viral Video, Allu Arjun, Sukumar-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయి సూపర్ హిట్ టాక్ ను అందుకోవడం తో పాటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇక ఈ సినిమాలో నటీనటుల నటనకుగాను పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు.

ఇక సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో హ్యాట్రీక్ సినిమాగా రూపొందిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇకపోతే ఈ సినిమాలోనీ అన్ని పాటలు సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే.

 Spider Man Steps For Pushpa Rashmika Rara Sami Song Details, Pushpa, Spider Man,video Viral, Rashmika Mandanna, Spider Man Dance Steps, Rashika Mandanna, Pushpa Song, Ra Ra Sami Song, Viral Video, Allu Arjun, Sukumar-పుష్ప పాటకు స్పైడర్ మ్యాన్ స్టెప్పులు#8230; డ్యాన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇందులో అన్నిటికంటే ఎక్కువగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చేసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావా అనే పాట తెగ పాపులర్ అయ్యింది.ఈ పాట విడుదల అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మార్మోగిపోతోంది.

ఇక యూట్యూబ్ లో ఈ పాట రికార్డులను క్రియేట్ చేసింది.మిలియన్ల వ్యూస్, లక్షలు లైక్స్ ను అందుకుంది.

ఇక ఈ పాట తరువాత రారా సామీ అనే పాట కూడా తెగ పాపులర్ అయ్యింది.ఈ రెండు పాటలు కూడా యూట్యూబ్ లో ట్రెండింగ్ జాబితాలో చేరాయి.

ఎక్కడ చూసినా కూడా ఈ రెండు పాటలు మార్మోగి పోతున్నాయి.ఈ సాంగులను రీ క్రియేట్ చేస్తూ ఇప్పటికే పలువురు సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేశారు.

వీడియోలను షేర్ చేస్తూ పాటపై మీమ్స్ క్రియేట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు.

ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ రష్మిక కూడా ఈ పాటకు డాన్స్ వేసి అందరినీ ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ పాటకు స్పైడర్ మాన్ డ్యాన్స్ వేయడంతో అందరూ కూడా అయ్యారు.అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా స్పైడర్ మాన్ రారా స్వామి పాటకు డాన్స్ వేస్తుంటే, ఎదురుగా క్రిస్మస్ సంటా దేశంలో ఉన్న వ్యక్తులు అతడు ని అనుసరిస్తూ ఈ పాటకు స్టెప్పులు వేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందించడమే కాకుండా, ఆ స్పైడర్ మాన్ ఫై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube