పోప్‌ ను కలిసిన స్పైడర్ మ్యాన్..! అసలు విషయం ఏమిటంటే..?!

స్పైడర్ మ్యాన్ అంటే పిల్లలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.స్పైడర్ మ్యాన్ సినిమాను చూసి చాలామంది పిల్లలు స్పైడర్ మ్యాన్ లా నటించడం, స్పైడర్ మ్యాన్ లా వేషధారణ వేసుకోవడం లాంటివి చేసేవారు.

 Spider Man Meets Pope The Real Thing Is-TeluguStop.com

అయితే ఇప్పుడు సినిమాల్లోనే కాకుండా నిజంగానే స్పైడర్ మ్యాన్ వాటికన్ సిటీలోకి ఎంట్రీ ఇచ్చేసాడు.అసలు స్పైడర్ మ్యాన్ నిజంగా రావడం ఏంటి ? ఇది కలా లేక నిజామ ? అని అనుకుంటున్నారా ? మీ సందేహాలు తీరాలంటే అసలు వివరాల్లోకి వెళ్ళవలిసిందే.,/br>

వాటికన్ సిటీలో ఉన్న ఒక ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న కొంతమంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు.అయితే హఠాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు కానీ స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఒక వ్యక్తి రావడం అక్కడ ఉన్న అందరిని షాక్ కి గురయ్యేలా చేసింది.

 Spider Man Meets Pope The Real Thing Is-పోప్‌ ను కలిసిన స్పైడర్ మ్యాన్.. అసలు విషయం ఏమిటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పిల్లలకు స్పైడర్ మ్యాన్ అంటో ఎంతో ఇష్టమో అనే సంగతి అందరికి తెలిసిందే.

స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఉన్న వ్యక్తిని చూడటానికి చిన్నారులు ఉత్సాహం చూపారు.అలాగే అతను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో ఎంతో ఆనందంగా గడిపాడు.ఈ ఘటన వాటికన్ సిటీలోని శాన్ దమాసో వేదికగా చోటు చేసుకుంది.

స్పైడర్ మ్యాన్ వేషధారణలో వచ్చిన వ్యక్తి పేరు మాటియో విల్లార్డిటా.ఆ వ్యక్తి అలా స్పైడర్ మ్యాన్ వేషం వేయడం వెనుక ఒక కారణం ఉంది అంట.అక్కడ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న చిన్నారులలో నూతన ఉత్సహం కలిగించేందుకు స్పైడర్ మ్యాన్ వేషం వేసుకొని రావడం జరిగిందన్నారు.అయితే అక్కడ ఉన్న పలువురు అతనితో సెల్ఫీలు దిగారు.

దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడ తెగ వైరల్ గా మారాయి.

Telugu Meets, Popo, Social Media, Spider Man, Vatican City, Viral Latest, Viral News-Latest News - Telugu

అనంతరం వాటికన్ సిటీలో ఉన్న పోప్ ప్రాన్సిస్ ను ఆయన కలిశారు.అలాగే తలకు ధరించే స్పైడర్ మ్యాన్ మాస్క్ ను అక్కడ ఉన్న పోప్ ప్రాన్సిస్ కు ఇచ్చారు మాటియో.స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఉన్న మాటియో, అలాగే పోప్ ప్రాన్సిస్ లు మాట్లాడుతూ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

పోప్ ఫ్రాన్సిస్ ను కలవడం చాలా ఆనందంగా ఉందని, అనారోగ్యంతో ఉన్న​ చిన్న పిల్లలు, వారి కుటుంబాల కోసం ప్రార్థించాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ ని కోరినట్లు మాటియో తెలిపారు.చిన్నారుల వద్దకు తాను వెళ్లినప్పుడు వారి బాధను మాస్క్‌ ద్వారా చూస్తున్నట్లు తెలియజేడానికి పోప్‌ కు మాస్క్‌ ఇచ్చినట్లు వెల్లడించారు.

#Spider Man #Popo #Meets #Social Media #Vatican City

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు