వైరల్.. హల్ చల్ చేసిన స్పైడర్ మ్యాన్.. ఫేమస్ అవ్వడం కోసమే..!

ఈ మధ్య జనాలు ఎలా తయారు అవుతున్నారంటే.వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం ఎంతటి సాహసాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటున్నారు.

 Spider Man Brawl London Supermarket Attack Viral-TeluguStop.com

ఫేమస్ అవ్వాలనే తపనతో ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు.తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఈ వీడియో చుసిన నెటిజెన్స్ అయ్యో పాపం అనుకుంటున్నారు.అంత ఏం జరిగిందా అని అనుకుంటున్నారా.

 Spider Man Brawl London Supermarket Attack Viral-వైరల్.. హల్ చల్ చేసిన స్పైడర్ మ్యాన్.. ఫేమస్ అవ్వడం కోసమే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక వ్యక్తి స్పైడర్ మ్యాన్ గెటప్ లో సూపర్ మార్కెట్ లోకి చొరబడి నానా హంగామా చేసాడు.అందులో ఉన్న సిబ్బందిని బెదిరించి వాళ్ళ మీద చేయి చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియో చుసిన నెటిజెన్స్ వాళ్లపై ఫైర్ అవుతున్నారు.ఆ తర్వాత ఆ స్పైడర్ మ్యాన్ గెటప్ లో ఉన్న వ్యక్తిని పోలీసులకు అప్ప జెప్పారు.

ఈ ఘటన లండన్ లో జరిగింది.అక్కడ ఉన్న సూపర్ మార్కెట్ లోకి ఒక వ్యక్తి సూపర్ మ్యాన్ గెటప్ వేసుకుని లోపలికి ప్రవేశించాడు.

అతనితో పాటు ఇంకొంత మంది కూడా ఉన్నారు.

సెక్యూరిటీ సిబ్బంది వీరిని అడ్డుకున్న కూడా వాళ్ళను కొట్టి లోపలకు ప్రవేశించారు.స్పైడర్ మ్యాన్ గెటప్ లో ఉన్న వ్యక్తి అక్కడ ఉన్న సిబ్బందిని బెదిరించి అందులోని వస్తువులను చెల్లాచెదురు చేసేసాడు.

ఆ తర్వాత ఒక మహిళా సిబ్బందిపై కూడా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే పడిపోయింది.

అతడు చేసిన బీభత్సానికి లోపాలు ఉన్న వారంతా భయ పడిపోయారు.ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ దాడి అనుకోకుండా జరగలేదని ప్లాన్ చేసి మరి కొంతమంది టిక్ టాక్ యూజర్లు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో వెల్లడైంది.ప్రస్తుతం వీళ్ళు చేసిన బీభత్సం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

#Asda Attack #Mob Attack #Attack Viral #ViralMan #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు