ఎక్కువసేపు ఏసిలో గడిపితే ఇన్ని నష్టాలా!

ఏసి మనిషి జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేసిందంటే ఆఫీసులో ఏసి కావాలి, ఇంట్లో కూడా కావాలి.ఏసి కోసం సినిమా థియేటర్ కి వెళ్ళే జనాలు కూడా ఉన్నారు.

 Spending Much Time In Ac Will Harm Your Health In These Ways-TeluguStop.com

కారులో కూడా ఏసి కావాలి.డబ్బులు ఎక్కువైనా ఫర్వాలేదు కాని ఏసి హోటల్లోనే తినాలి.

ఇప్పుడు ఏసి అనేది అవసరం మాత్రమే కాదు, ఒక స్టేటస్ సింబల్ కూడా.ధనవంతులని, మధ్యతరగతివారిని ఓరకంగా ఏసి, నాన్ ఏసి అంటూ డివైడ్ చేసేసింది ఏసి.అయితే ఈ ఏసి ఒంటికి సుఖం మాత్రమే కాదు, ప్రమాదం కూడా.

* ఎక్కువ సమయం ఏసిలో గడిపితే రోగనిరోధకశక్తి తగ్గతూ ఉంటుంది.

తరచుగా తలనొప్పి, జ్వరం లాంటి చిన్న సమస్యలతో పాటు, పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం పెరుగుతుంది.

* ఏసి అంటే కృత్రిమంగా వాతావరణాన్ని చల్లబరచుకోవడం.

దీనివల్ల చర్మకణాల పొడిగా మారతాయి.

* ఎక్కువ సమయం ఏసిలో గడపటం వలన కనులు కుడా డ్రైగా మారి దురద, ఇరిటేషన్ మొదలవుతుంది.

* పైన చర్మం చల్లగా ఉంటే సరిపోదు.శరీరం లోపల కూడా చల్లగా ఉండాలి.

ఏసి వలన చర్మం చల్లగా ఉంటుంది కాని, బాడి లోపల వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.

* ఏసిలో ఎక్కువగా గడిపితే స్వచ్ఛమైన బయటి గాలికి దూరమవుతారు.

* ఏసిని సరిగా క్లీన్ చేయకపోతే, అందులో ఉండే దుమ్ము, ధూలి ఇంట్లోనే తిరుగుతూ అనారోగ్యానికి కారణమవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube