ఇలినాయిస్ విద్యార్ధులకు స్పెల్లింగ్ బీ పోటీలు

అమెరికాలోని ఇలినాయిస్‌ విద్యార్ధుల ప్రతిభను ప్రపంచానికి చాటే పోటీలను ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు నిర్వాహకులు రంగం సిద్ధం చేశారు.ప్రపంచవ్యాప్తంగా విద్యార్ధులచే అతి క్లిష్టమైన పదాల స్పెల్లింగ్‌ను వారితో సరిగా పలికించే పోటీలను నిర్వహించేందుకు మరో వేదికను సిద్ధం చేశారు.

 Spelling Bee And Math Bee Competition From Tri State Telugu Association Chicago-TeluguStop.com

ఇలినాయిస్‌లోని పాలాటైన్ పబ్లిక్ లైబ్రరీ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి.

నార్త్ సౌత్ ఫౌండేషన్ ప్రోత్సాహంతో ఈ పోటీలను ఫిబ్రవరి 22న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.కాగా అసోసియేషన్ సభ్యులైన పోటీదారులు ఈ పోటీలో ఉచితంగా పాల్గొనవచ్చు.

మిగతావారు ప్రతి పోటీకి $10 చొప్పున ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

పాలాటైన్ పబ్లిక్ లైబ్రరీ‌ వేదికగా జరగబోయే ఈ పోటీలలో స్పెల్లింగ్ బీ ఉదయం 9 గం.నుండి మధ్యాహ్నం 12 గం.వరకు నిర్వహిస్తుండగా, మాథ్ బీ పోటీలను మధ్యాహ్నం 1 గం.నుండి 3.30 గం.ల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మధ్యాహ్న భోజన సమయం 12 నుండి 1.గం వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.ఈ పోటీలకు మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను చూడాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube