స్పీకర్ గారు మంత్రి అయిపోతున్నారా ? 

ఏపీ సీఎం జగన్  త్వరలోనే కేబినెట్ ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రివర్గం ఏర్పాటు చేసి దాదాపు రెండున్నర సంవత్సరాలు కావోస్తుండడంతో కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

 Tammineni Sitharam, Ap Speker, Ysrcp, Srikakulam, Jagan, Ap Cabinet, Ministers,-TeluguStop.com

ఈ మేరకు మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేసినట్లు ప్రచారం జరిగింది.ఈ క్రమంలో చాలామంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు.2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు ఖచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని ఆశలు పెట్టుకున్న నేతలకు జగన్ మొండిచేయి చూపించారు.సామాజిక వర్గాల సమతూకం అంటూ జగన్ మంత్రిమండలిని ఏర్పాటు చేశారు.

దీని కారణంగా జగన్ కు సన్నిహితులైన చాలా మంది కి మంత్రి పదవి దక్కలేదు.రెండున్నర సంవత్సరాల తర్వాత వారికి తప్పకుండా మంత్రి పదవులు ఇస్తామనే హామీ లభించడంతో వీరంతా చాలా ఆశలనే పెట్టుకొన్నారు.

మరికొన్ని రోజుల్లో కొత్త మంత్రివర్గాన్ని జగన్ ఏర్పాటు చేస్తుండటంతో, తమకు తప్పకుండా అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు.వీరిలో ముఖ్యంగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి పదవిపై చాలా రోజుల నుంచి ఆశగా ఎదురుచూస్తున్నారు.

అసలు మొదట్లోనే తనకు మంత్రి పదవి వస్తుందని అభిప్రాయపడ్డారు కానీ, జగన్ అనూహ్యంగా స్పీకర్ పదవిని కట్టబెట్టడం తో అసంతృప్తితోనే ఆ పదవిలో కొనసాగుతున్నారు.అయితే ఇప్పుడు మంత్రి పదవి కి తమ్మినేనిని జగన్ ఎంపిక చేశారు అనే సమాచారంతో తమ్మినేని బాగా యాక్టీవ్ అయినట్టుగా కనిపిస్తున్నారు.

Telugu Ap, Ap Speker, Chandrababu, Jagan, Ministers, Srikakulam, Ysrcp-Telugu Po

తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న టిడిపి పై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.అంతేకాదు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో క్షేత్రస్థాయిలో ఆయన పర్యటనలు చేస్తున్నారు.అనేక అభివృద్ధి కార్యక్రమాల్లోనూ, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.టిడిపి పైన ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.

ఇదంతా మంత్రి పదవిపై ఆయన ఆశలు పెట్టుకోవడమే కారణంగా కనిపిస్తోంది.తనకు తప్పకుండా మంత్రి పదవి రాబోతుంది అనే విషయాన్ని అనే విషయాన్ని అదే పనిగా తన అనుచరులు ,ముఖ్య నాయకులతోనూ  చర్చిస్తూ ఉన్నారు.

తమ్మినేని ఆశపడుతున్నట్టు గా జగన్ కొత్త మంత్రి వర్గం లిస్ట్ లో ఆయన పేరు చేర్చారో లేదో మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube