గూగుల్‌ పై కన్నడిగుల ఆగ్రహం.. ఎందుకంటే..?!

సిరిగన్నడగా పేరొందిన కన్నడ పురాతన ద్రావిడ భాషలలో ఒకటి.అన్ని మాండలికాలతో కలుపుకొని సుమారు 5 కోట్ల మంది మాట్లాడే ఈ భాష భారత దేశ దక్షిణాది రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రమైన కర్ణాటక యొక్క అధికార భాష.దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళ్ ల తర్వాత అత్యధిక మంది ప్రజలు కన్నడ భాషను మాట్లాడుతారు.కన్నడ భాష దాదాపుగా 2500 సంవత్సరములుగా మాట్లాడబడుతోంది.

 Spectacles Angry At Google Because Google, Kannada Language, Uglist , Viral , Vi-TeluguStop.com

దాని లిపి 1900 సంవత్సరములుగా వాడుకలో ఉంది.కన్నడ భాషను ప్రధానముగా భారతదేశము లోని కర్ణాటక రాష్ట్రములో, అల్ప సంఖ్యలో ఇరుగుపొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ,, తమిళునాడు, కేరళ, మహారాష్ట్రలో మాట్లాడుతారు.

అమెరికా, యునైటెడ్ కింగ్‌డం, కెనడాలలో కూడా చెప్పుకోదగిన సంఖ్యలో కన్నడ మాట్లాడే ప్రజలు ఉన్నారు.మరి ఇటువంటి భాషకు అన్యాయం జరిగింది.

కన్నడ భాష విషయంలో గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ విమర్శకు తావిస్తుంది.ఇండియాలో అత్యంత వికారమైన భాష ఏదని గూగుల్ లో సెర్చ్ చేస్తే కన్నడ అని చూపిస్తుంది.

దీనిపై కన్నడ ప్రజలు మండిపడుతున్నారు.ఒక్క కన్నడవారే కాదు దేశంలోని చాలామంది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యవహారంపై నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.దీనిపై పొలిటికల్ లీడర్స్ కూడా స్పందించారు.బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ ఎంపీ పీసి మోహన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ విజయనగర సామ్రాజ్యానికి నిలయం, విలువైన వారసత్వ సంపద కన్నడ భాష.కన్నడ భాషకు ప్రత్యేకమైన సంస్కృతి ఉందని అన్నారు.ప్రపంచంలో ఉన్న అతిపురాతన భాషల్లో కన్నడ కుడా ఒకటని తెలిపారు.జాఫ్రీ చౌసెర్ పుట్టకముందే కన్నడలో పురాణాలు ఉన్నాయన్నారు.ఓ భాషను అవమానించడం తగదని వెంటనే గూగుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు పీసి మోహన్.ఇక నెటిజన్లు ఎవరికీ తోచిన విదంగా వారు పోస్టులు పెడుతున్నారు.

కొందరు కన్నడ కంటే మంచి భాషా ఎదో చెప్పండి అని ప్రశ్నిస్తే.మరికొందరు గూగుల్ ను ఇండియాలో బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube