ఏపీలో నేడు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్..!

కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రాలన్ని స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ లను ఏర్పాటు చేయగా లేటెస్ట్ గా ఏపీలో ఆదివారం నాడు స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు.

 Special Vaccine Drive In Andhra Pradesh , Andhra Pradesh , Ap Special Vaccine Dr-TeluguStop.com

ఈరోజు ఒక్కరోజే ఏకంగా 8 లక్షల మందికి టీకాలు వేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.అందుకు తగినట్టుగానే ముందుగా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారట.

కేసులు తగ్గుముఖం పడుతున్న ఇలాంటి టైం లో వ్యాక్సిన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.ఒక్కరోజే 8 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేలా టార్గెట్ పెట్టుకున్నారు.

ఈమేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సినేషన్ అందించాలని చెప్పారు.

వారిపైనే స్పెషల్ ఫోకస్ చేయాలని ఆదేశాలు చెప్పారు.ఇప్పటికే ఏపీలో ఒక్కరోజే 6 లక్షల వ్యాక్సిన్లు వేసి చరిత్ర సృష్టించగా ఇప్పుడు 8 లక్షల టార్గెట్ పెట్టుకుని నేడు స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు.

ఇక టోటల్ గా ఇప్పటివరకు ఏపీలో 1,22,83,479 మందికి వ్యాక్సిన్ డోసులను అందించినట్టు సమాచారం.వ్యాక్సినేషన్ ప్రారంభించిన నాటి నుండి రెండు సార్లు ఒక్కరోజే 6 లక్షల వ్యాక్సిన్ డోస్ లు వేయగా ఈరోజు స్పెషల్ డ్రైవ్ లో 8 లక్షల నుండి 10 లక్షా దాకా వ్యాక్సిన్ అందించాలని చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube