లోకేష్ కోసం స్పెషల్ టీమ్ ? స్పెషల్ ఫోకస్

తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కనిపించినంత నిరుత్సాహం ప్రస్తుతం నెలకొంది.వైసీపీ అధికారంలోకి వస్తే తమకు ఇబ్బంది ఎదురవుతుందని టిడిపి ముందుగా అంచనా వేసినా, అంత కంటే రెట్టింపు స్థాయిలో ఆ వైరస్ ప్రభావం ఉండడం టిడిపికి ఇబ్బందికరంగా మారింది .

 Special Team For Lokesh Special Focus, Ap Government , Chandrababu , Chinababu ,-TeluguStop.com

పార్టీ నేతలు ఎవరు యాక్టివ్ గా ఉండేందుకు ఇష్టపడటం లేదు .అదే విధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఉన్న నారా లోకేష్ నాయకత్వంలో పనిచేసేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.70 ఏళ్ల వయసు దాటిన చంద్రబాబు పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ,  పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఎక్కడా, ఎవరూ నిరాశ చెందకుండా అందరికీ భరోసా ఇచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నారు.

చంద్రబాబు మరెంతోకాలం యాక్టివ్ గా ఉండే పరిస్థితి లేకపోవడంతో , ఏదో రకంగా లోకేష్ ను పార్టీలో తన స్థాయి వ్యక్తి గా తీర్చి దిద్దేందుకు,  లోకేష్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండే విధంగా ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు.

 క్షేత్రస్థాయిలో కి వస్తే టిడిపి కి మళ్ళీ పునర్వైభవం రావాలంటే తప్పనిసరిగా జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటూ , ఆయన  మాత్రమే టీడీపీని గట్టెక్కించగలరని చంద్రబాబు పర్యటన  లోనేేడిమాండ్  చేస్తుండడం ఇబ్బందికరంగా మారాయి.

అందుకే లోకేష్ ను యాక్టివ్ చేయడంతో పాాటు , ప్రత్యేకంగా మీడియా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే విధంగా  తన ప్రసంగాలలో పదును కల్పించే విధంగా చంద్రబాబు ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి, వారితో స్పెషల్ ట్రైనింగ్  ఇప్పిస్తూ, వారి ఆధ్వర్యంలోనే లోకేష్ ఇప్పుడు వైసిపికి , ఆ పార్టీ అధినేత జగన్ కు సవాళ్ళు విసురుతూ,  టిడిపి తరఫున ప్రతి విషయంలోనూ ఆయన స్పందిస్తూ,  ప్రజా పోరాటాలు చేపడుతూ వస్తున్నారు.ఇక సోషల్ మీడియా, ప్రధాన మీడియా లో ఏ ఏ అంశాలు మాట్లాడాలి అనే విషయం పైన ప్రత్యేక టీమ్ సూచనల మేరకు లోకేష్ యాక్టివ్ గా ఉంటున్నారట.

ఇక సీనియర్ నాయకులతో పాటు,  తమకు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల ద్వారా లోకేష్ ను ప్రమోట్ చేస్తూ, లోకేష్ బలమైన నాయకుడిగా చూపించే ప్రయత్నం లో చంద్రబాబు ఉన్నారట.

Telugu Ap, Chandrababu, Chinababu, Jagan, Lokesh, Tdp-Telugu Political News

 లోకేష్ గతంతో పోలిస్తే పొలిటికల్ గా బాగా యాక్టివ్ అయ్యారు.ప్రతి విషయంలోనూ వైసీపీ ని ఇబ్బంది పెడుతూ,  రాజకీయంగా మంచి మైలేజ్ సంపాదిస్తున్నారు .ఈ పరిణామాలు అన్ని క్షేత్రస్థాయిలో పార్టీ లోకి లోకి,  వెళ్తే లోకేష్ రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది చంద్రబాబు ఎత్తుగడగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube