వైసీపీ మూడ్ మారుతోంది ! కలకలం రేపుతోంది ?

ఏపీ అధికార పార్టీ వైసీపీ అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.ప్రస్తుతం పార్టీ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా, రాబోయే ఎన్నికల నాటికి ప్రజా తీవ్రత కాస్త పెరగడంతోపాటు, తమ ప్రత్యర్ధి పార్టీలు బలం పుంజుకుంటాయి అనే అనుమానం వైసిపి అధినేత జగన్ లో కనిపిస్తోంది.

 Special Surveillance Was Set Up On Jagan Officials In The Election Mood-TeluguStop.com

ఈ మేరకు ఎన్నికలకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.ప్రస్తుతం జగన్ ఏం చేసినా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యవహారాలు చేస్తున్నారు.

జగన్ వ్యవహారశైలి చూస్తే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతున్నారా అనే అనుమానాలు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు అధికార వర్గాల్లోనూ కలుగుతున్నాయి. 

 Special Surveillance Was Set Up On Jagan Officials In The Election Mood-వైసీపీ మూడ్ మారుతోంది కలకలం రేపుతోంది -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికి తగ్గట్టుగానే ప్రశాంత్ కిషోర్ టీమ్ న రంగంలోకి దించబోతున్నట్లు స్వయంగా జగనే మంత్రులకు చెప్పడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.

పార్టీ నేతలతో పాటు, అధికారులను ఎన్నికల మూడ్ లోకి తీసుకు వెళ్లేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు ఇప్పటి నుంచే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

ముఖ్యంగా కీలక అధికారులు విషయంలో జగన్ రాజకీయంగా నిఘా పెట్టారని, ఎవరి నేపథ్యం ఏంటి ? వారు ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ? వారి వల్ల తమకు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా ? ఎన్నికల్లో వారి వ్యవహార శైలి ఎలా ఉండబోతోంది ఇలా రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకుని అధికారుల వ్యవహారశైలిని అంచనా వేసే పనిలో జగన్ టీమ్ నిమజ్జనం అయిందట.
 

Telugu Ap, Ap Elections, Bjp, Chandrababu, Jagan, Jagan Focus On Ycp Leaders, Jagan Strategies, Janasenani, Pavan Kalyan, Prasanth Kishore, Tdp, Telugu Desam Party, Ysrcp-Telugu Political News

అయితే ఈ వ్యవహారాలన్నీ రహస్యంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.ఐఏఎస్, ఐపీఎస్ లతోపాటు,  డివిజనల్ స్థాయి అధికారుల విషయంలోనూ అన్ని అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.టిడిపి, బిజెపి పార్టీ లకు సహకరించే అధికారులను పూర్తిగా పక్కన పెట్టి,  వారిని ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించాలని అనధికారికంగా ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

ప్రస్తుతం వైసిపి నాయకులతో పాటు, అధికార వర్గాల్లోనూ ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. 

 

#Janasenani #Jagan #Pavan Kalyan #Ysrcp #Jagan Ycp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు