ప్రత్యేక కథనం : అసలు అయోధ్య ఎవరిది?

సుదీర్ఘ కాలంగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య భూ వివాద కేసు నేడు తుది తీర్పు రాబోతున్న విషయం తెల్సిందే.హిందువులకు అనుకూలంగా తీర్పు రాబోతుంది అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

 Special Story About Rama Mandir And Babri Majid-TeluguStop.com

ముస్లీంలు కూడా ఇప్పటికే ఎలాంటి తీర్పు వచ్చినా కూడా స్వాగతిస్తాం అంటూ ప్రకటించారు.అయోధ్య రామ మందిరం కేసు విషయంలో జరిగిన వాదోపవాదనలు విన్న చీప్‌ జస్టీస్‌ గొగోయ్‌ నేడు తుది తీర్పును వెలువరించనున్నారు.

హిందూ మరియు ముస్లీంలు ప్రశాంతంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా విజ్ఞప్తి చేస్తోంది.కొన్ని వేల మందిని గృహ నిర్భందం చేయడంతో పాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో 144 సెక్షన్‌ను విధించడం జరిగింది.

Telugu Ayyodyarama, Ramamandir, Storyrama, Suprim Finnal-

అయోధ్య అనగానే రామ జన్మభూమి గుర్తుకు వస్తుంది.రాముడు పుట్టి పెరిగిన నేల అవ్వడం వల్ల అక్కడ రామాలయం ఉండాలని హిందువులు కోరుకుంటున్నారు.1527లో మెఘల్‌ చక్రవర్తి బాబార్‌ ఆదేశాల అనుసారంగా అక్కడ మసీదు నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతోంది.అంతకు ముందు అక్కడ రామ మందిరం ఉందని, దాన్ని కూల్చి వేయించి బాబార్‌ మసీదును నిర్మింపజేశాడని, అప్పటి నుండి కూడా ఆ మసీదుపై వ్యతిరేకత వస్తుందని చరిత్ర కారులు చెబుతున్నారు.హిందువులు రామజన్మభూమిలో రామాలయం నిర్మించాల్సిందే అంటూ అప్పటి నుండి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు.

1992 డిసెంబర్‌ 2న కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చి వేయడం జరిగింది.అప్పటి బీజేపీ నాయకులు అద్వానీ మరియు జోషీల ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమం నుండి కరసేవకులు మసీదు వైపుగా దూసుకు వెళ్లారు.పదులు.వందలు ఇలా మెల్ల మెల్లగా బాబ్రీ మసీదు వద్దకు భారీగా జనాలు వెళ్లారు.అక్కడ ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక పోయారు.

నాయకులు కూడా వారిని వారించేందుకు ప్రయత్నించలేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.కూల్చి వేతకు ముందస్తుగానే కుట్ర పన్నినట్లుగా అనుమానాలు ఉన్నాయి.

Telugu Ayyodyarama, Ramamandir, Storyrama, Suprim Finnal-

బాబ్రీ మసీదు కేసు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత పరిణామాలు చాలా స్పీడ్‌గా మారాయి.ఆ సమయంలో దేశ వ్యాప్తంగా మత కల్లోలాలు లేచాయి.అనధికారిక లెక్కల ప్రకారం అయిదు వేల మంది చనిపోయినట్లుగా ప్రచారం జరిగింది.అధికారిక లెక్కల ప్రకారం అయితే రెండు వేల మంది చనిపోయినట్లుగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.అయోధ్య కేసు బాబ్రీ మసీదు కూల్చి వేత తర్వాత మరింత తీవ్రతరం అయ్యింది.

ప్రతి ఒక్కరు కూడా అయోధ్య రామ మందిరం, బాబ్రీ మసీదు కూల్చి వేత గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు.

Telugu Ayyodyarama, Ramamandir, Storyrama, Suprim Finnal-

రామ మందిరం ఉంది కనుక అయోధ్యలోని ఆ భూమిని హిందువులకు ఇవ్వాలని అత్యధికులు కోరుతుంటే 1527 నుండి అక్కడ మసీదు ఉంది కనుక ఆ భూమి చట్ట ప్రకారం ముస్లీంలదే అవుతుందని అంటున్నారు.సుదీర్ఘ విచారణ తర్వాత అసలు విషయం ఏంటీ అనేది నేడు తీర్పులో వెలువడబోతుంది.ఎలాంటి తీర్పు వచ్చినా ప్రతి ఒక్కరు కూడా సహనంతో, సంయమనం పాటించాలని ప్రభుత్వం కోరుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube