వెంకీ మామ కోసం స్పెషల్‌గా వేశారట!

గతేడాది విడుదలైన ఎఫ్-2 చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఎఫ్-2 రావడంతో ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

 Special Set For Venkatesh F3, Venkatesh, F3, Varun Tej, Anil Ravipudi, Tamannaah-TeluguStop.com

ఇక ఎఫ్-2 అందుకున్న సక్సెస్‌తో ఆ సినిమాకు ఎఫ్-3 అనే సినిమాను సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.ఈ సినిమా షూటింగ్‌ను తాజాగా ప్రారంభించారు చిత్ర యూనిట్.

ఈ షూటింగ్‌లో హీరో విక్టరీ వెంకటేష్ కూడా జాయిన్ అయ్యాడు.

కాగా వెంకటేష్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ కోసం ఓ స్పెషల్ సెట్‌ను వేశారట ఎఫ్-3 చిత్ర యూనిట్.ఎఫ్-2లో లాగానే ఈ సినిమాలో కూడా వెంకీ పాత్ర అదిరిపోతుందని, అందుకే ఆయన పాత్రపై ఉన్న అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఉండే విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనిల్.అటు మరో హీరో వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో త్వరలో జాయిన్ అవుతాడని, వెంకీ-వరుణ్‌లు కలిసి చేసే హంగామా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఎఫ్-3 చిత్రంలో కూడా వెంకీ పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్ ఫిదా కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో వెంకీ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ పీర్జాదా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

కాగా ఎఫ్-2 చిత్రం భార్యాభర్తల నేపథ్యంలో రాగా, ఈసారి డబ్బు నేపథ్యంలో ఎఫ్-3 రానుందని చిత్ర యూనిట్ తెలిపింది.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

మరి ఎఫ్-3 చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube