అది సంగతి : సంక్రాంతికి గాలి పటాలకు సంబంధం ఏంటో మీకు తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ సంక్రాంతి.ఈ సంక్రాంతి సంబరాలు వారం రోజులు సాగుతాయి.

 Special Reason Flying Kites On Sankranti Festival-TeluguStop.com

తెలంగాణలో కంటే ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి ఉత్సవాలు అంబరాన్ని తాకేలా జరుగుతాయి.అద్బుతమైన వేడుకలకు అక్కడ నెలవు.

ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు వారు ఖచ్చితంగా సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లాలని అనుకుంటారు.ఇక సంక్రాంతి సీజన్‌లో ఎక్కువగా కనిపించేది గాలి పటాలు ఎగరవేయడం మరియు కోడి పందాలు.

ఏపీలో మాత్రమే కోడిపందాలు కాస్తారు.కాని గాలిపటాలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తాయి.

సంక్రాంతికి గాలి పటాలకు, కోడి పందాలకు అసలు సంబంధం ఏంటీ అంటూ కొన్ని సార్లు అనుమానం కలుగవచ్చు.సంక్రాంతికి మాత్రమే గాలి పటాలు ఎగురవేస్తారు, దసరా సమయంలో గాలి పటాలు ఎగురవేయరు.

దసరాకు కూడా వారం పది రోజులు సెలవులు వచ్చినా కూడా పిల్లలు సంక్రాంతి సీజన్‌కు మాత్రమే గాలి పటాలు ఎగురవేస్తారు.

Telugu Kites, Kitessankranti, Sankranti-General-Telugu

ఇది ఇప్పటి నుండి వస్తున్న సాంప్రదాయం కాదు.ఇందులో చాలా ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు.హిందూ ధర్మం అంతకంటే లేదు.

పెద్దలు అప్పట్లో సంక్రాంతి పండుగ సమయంలో ఉదయం వాతావరణం శరీరానికి చాలా మంచిది అనే ఉద్దేశ్యంతో గాలి పటాలు ఎగురవేయించేవారు.

Telugu Kites, Kitessankranti, Sankranti-General-Telugu

ఉదయం 9 నుండి 10 గంటల లోపులో ఈ సీజన్‌లో సూర్యుడి నుండి వచ్చే సూర్య కిరణాలు చాలా పవర్‌ ఫుల్‌గా ఉంటాయి.పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి.అందుకే సంక్రాంతి సీజన్‌లో తప్పకుండా గాలి పటాలు ఎగురవేయాలని, అది కూడా ఉదయం 10 గంటల లోపు ఎక్కువగా ఎగురవేయాలని పెద్దలు చెప్పారు.

కాని ఇప్పుడు పిల్లలు సెలవులు అని 10 గంటల వరకు పడుకుని, ఆ తర్వాత బయటకు వెళ్లి గాలి పటాలు ఎగురవేస్తున్నారు.మీ పిల్లలు కూడా గాలి పటాలు ఎగురవేస్తూ ఉంటే వారిని 9 నుండి 10 గంటల మద్య ఎగురవేయమని మీరు సూచించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube