రమ్యకృష్ణ బర్త్ డే.. బంగార్రాజు నుంచి రొమాంటిక్ పోస్టర్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున రమ్యకృష్ణ జోడికి ఎంతో క్రేజ్ ఉందని చెప్పవచ్చు.వీరిద్దరి కాంబినేషన్ లో మొట్టమొదటగా తెరకెక్కిన సంకీర్తన సినిమా నుంచి సోగ్గాడే చిన్నినాయన సినిమా వరకు సూపర్ హిట్ పెయిర్ గా నిలిచింది.

 Special Poster Bangarraju Birthday Wishes To Satyabhama-TeluguStop.com

ఇదిలా ఉండగా సోగ్గాడే చిన్నినాయన సినిమాలో వీరిద్దరి జంట ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా బంగార్రాజు సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 Special Poster Bangarraju Birthday Wishes To Satyabhama-రమ్యకృష్ణ బర్త్ డే.. బంగార్రాజు నుంచి రొమాంటిక్ పోస్టర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాగచైతన్యకు జోడిగా కృతిశెట్టి ఈ సినిమాలో నటించగా నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నారు.

Telugu Bangarraju, Krithi Shetty, Nagachaitanya, Ramya Krishna, Ramya Krishna Birthday, Tollywood-Movie

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15 న రమ్యకృష్ణ పుట్టిన రోజు కావడంతో మా సత్యభామకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూబంగార్రాజు చిత్రం నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ రమ్యకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పోస్టర్ లో రమ్యకృష్ణ గులాబి రంగు చీరను ధరించి ఉండగా వెనకే నాగార్జున డాన్స్ వేస్తూ ఉన్నారు.ఈ పోస్టర్ ని బట్టి చూస్తే ఈ స్టిల్ పాటలోదని అర్థమవుతుంది.

ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.ప్రస్తుతం ఈ సినిమా నుంచి విడుదలైన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#Ramya Krishna #Ramya Krishna #Nagachaitanya #Krithi Shetty #Bangarraju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు