తెలంగాణలో అధికారం సాధించడమే ఏకైక లక్ష్యంగా బిజెపి ముందుకు వెళ్తోంది.గతంతో పోలిస్తే ఆ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా సద్వినియోగం చేస్తున్నందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది .
దీనిలో భాగంగానే కేంద్ర బీజేపీ పెద్దలు రాష్ట్ర నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కట్టడి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు .అలాగే ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను హైలెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.కేంద్రంలో బిజెపినే అధికారంలో ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం కు అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారు. మరోవైపు అధికారం కోసం కాంగ్రెస్ సైతం కాచుకుని కూర్చుండడం, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం టిఆర్ఎస్ , బిజెపిలను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ ను మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తూ ఉండడం తో బిజెపి కూడా అలర్ట్ అయింది.
సందర్భం వచ్చిన ప్రతిసారీ కేంద్ర బిజెపి పెద్దలంతా తెలంగాణలో అడుగు పెడుతూ, టిఆర్ఎస్ కాంగ్రెస్ లను టార్గెట్ చేసుకుని విరుచుకుపడుతున్నారు .ప్రస్తుతం తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు .ఈనెల 16వ తేదీన బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఉంది.

ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కాబోతున్నారట.కరీంనగర్ లో 5 విడత ప్రజాసంగమం యాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించబోతూ ఉండడంతో , ఆ కార్యక్రమంలో జేపీ నడ్డా తో పాటు, బిజెపి కీలక నాయకులు కొంతమంది హాజరు కాబోతున్నారట.ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి రాగా, టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ కీలక నేత బి ఎల్ సంతోష్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం వంటి వ్యవహారాలతో టీఆర్ఎస్ బిజెపిల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతోంది.