కరోనా సోకిన అనాధ పిల్లలకోసం ప్ర‌త్యేక హెల్ప్‌లైన్ డెస్కు.. ఈ నంబర్‌కు కాల్ చేస్తే చాలు.. !

అనాధ.ఈ పేరు ముందు బహుశ ఏ వైరస్ కూడా పనిచేయదు.

 Special Helpline Desk For Orphan Children Infected With Corona , Telangana, Spec-TeluguStop.com

ఒక వ్యక్తికి జీవితంలో అన్నీ ఉన్నా కూడా అతను ఒంటరిగా, అనాధగా ఉండగా కలిగే మనోవేదన ఎన్ని మత్తు మందులు తీసుకున్న చల్లారదు.అందులో కరోనా వచ్చి అందరు ఉన్నా, మనుషులను అనాధలుగా చేస్తుంది.

ఎందరో చిన్నారులకు తల్లితండ్రి లేకుండా చేస్తుంది.

కోవిడ్ వల్ల అప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు అన్నీ ఓడిపోతున్నాయి.

ఒంటరిగా మిగులు తున్నాయి.ఇలాంటి త‌రుణంలో తెలంగాణ ప్ర‌భుత్వం త‌ల్లిదండ్రుల‌ను, సంర‌క్ష‌కుల‌ను కోల్పోయిన పిల్ల‌ల కోసం ప్ర‌త్యేక హెల్ప్‌లైన్ డెస్కు ఏర్పాటు చేసింది.

ఇలాంటి పిల్ల‌ల‌ను చైల్డ్ కేర్ సెంట‌ర్లు, అనాథ గృహాల్లో ఉంచుతామ‌ని మ‌హిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తెలిపింది.ఈ విషయం లో పూర్తి వివరాలు కావాలంటే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబ‌ర్ – 1098 కు.ఇత‌ర వివ‌రాల కోసం 040-23733665 నంబ‌ర్‌ ను ప్ర‌తి రోజు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు సంప్ర‌దించ వచ్చని పేర్కొంటుంది.ఇక మానవత్వం ఉన్న వారు ఎవరైనా తమ కంటికి ఇలాంటి పిల్లలు కనబడితే పై నంబర్‌కు కాల్ చేయాలని తెలుపుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube