రామరాజు కోసం భీం బ్యాంగ్.. ఆగలేడట!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తు్న్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

 Special Gift From Ntr To Ram Charan From Rrr-TeluguStop.com

కాగా ఉగాది సందర్భంగా చిత్ర మోషన్ పోస్టర్ అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది.ఇక మరో సర్‌ప్రైజ్‌కు ఆర్ఆర్ఆర్ సిద్ధమైంది.

మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన స్పెషల్ గిఫ్ట్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.ఈ సందర్భంగా తారక్ ‘రామరాజు కోసం భీం’ అంటూ ట్యాగ్ చేసి చరణ్ పుట్టినరోజును మరింత ఘనంగా జరుపుకోవాలని ఉందని, కానీ ప్రస్తుతం కఠిన పరిస్థితులు నెలకొన్న సందర్భంగా రేపు ఉదయం 10 గంటలు అదిరిపోయే బ్యాంగ్‌ను ఇస్తున్నట్లు తెలిపాడు.

చరణ్‌కు ఇది జీవితాంతం గుర్తుండిపోవడం ఖాయమని తారక్ ధీమా వ్యక్తం చేశాడు.

కాగా ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ నుండి మరో సర్‌ప్రైజ్ రానుండటంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube