ఆ ఇద్ద‌రు స్టార్ క్రికెట‌ర్ల కోస‌మే స్పెష‌ల్ ఫ్లైట్ బుక్ చేసిన ఫ్రాంచైజీ..

క్రికెట్ పేరు వింటేనే యూత్ ఊగిపోతుంది.అంత‌లా మ‌న దేశంలో క్రికెట్ కు పేరుంది.

 A Special Flight Booked Rcb Franchise For Star Cricketers Kohli And Siraj,  Vira-TeluguStop.com

ఇక ఇందులో పొట్టి ఫార్మాట్‌లో ఆడే ఐపీల్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.అయితే మొన్న క‌రోనా కార‌ణంగా మ‌ధ్య‌లోనే ఆగిపోయిన ఐపీఎల్‌ను ఇప్పుడు మ‌ళ్లీ దుబాయ్ వేదిక‌గా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం టీమ్ ఇండియా ఆట‌గాళ్లు అంద‌రూ కూడా ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు తిరుగు ప్రయాణం అవుతున్న సంగ‌తి విదిత‌మే.ఇక వీరంతా ఇండ్ల‌కు చేరుకుని ఆ త‌ర్వాత వారం రోజుల్లోగా ఐపీఎల్ 2021 రెండవ ఫేజ్ కోసం దుబాయ్ వెళ్తున్నారు.

అయితే ఇక ఇందులో భాగంగా రాయల్ చాలెంజర్స్ టీమ్ స‌భ్యులు కూడా దుబాయ్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.కాగా అంద‌రి కోసం ఒకే ఫ్లైట్ బుక్ చేస్తుంటాయి ప్రాంచైజీలు.

అది ఆన‌వాయితీగా వ‌స్తున్న సంప్ర‌దాయం.కానీ ఈ సారి మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లి అలాగే బౌర‌ల్ మహ్మద్ సిరాజ్ కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ ను బుక్ చేస్తున్న ఆర్సీబీ ప్రాంచైజీ మేనేజ‌ర్లు.

ఇక ఇలాంటి ప్రత్యేక చార్ట‌ర్డ్ ఫ్లైట్‌లో దుబాయ్ కి వెళ్లి అక్క‌డ ఇద్ద‌రూ క‌డూఆ వేర్వేరుగా ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటార‌ని ఇప్ప‌టికే ఆర్సీబీ ప్రాంచైజీ ప్ర‌క‌టించిది.

Telugu Bowlermohammad, Virat Kohli, Chartered, Dubai, Ipl, Siraj-Sports News క

ఇక ఆర్సీబీ చెప్పిన దాని ప్ర‌కారం శనివారం రాత్రి కోహ్లి, సిరాజ్లు ఇద్ద‌రూ కూడా ప్ర‌త్యేక‌మైన చార్టర్ ఫ్లైట్ లో దుబాయ్‌కు బ‌య‌లు దేరుతారు.ఇక ఇలా బ‌య‌లు దేరిన వారు ఆదివారం ఉదయం దుబాయ్ ఎయిర్ పోర్టు నుంచి ప్ర‌త్యేకంగా బుక్ చేసిన హోట‌ల్‌లోకి వెళ్తారు.అయితే ఇలా ఇద్ద‌రి కోస‌మే ఇలాంటి స్పెష‌ల్ ఫ్లైట్ ఎందుకు బుక్ చేసిందో మాత్రం అర్థం కావ‌ట్లేదు.

ఏదేమైనా కూడా వారి అభిమానులు మాత్రం ఈ విష‌యంపై ఫుల్ ఖుషీలోఉన్నారు.మ‌రి ఈ సారి అయినా బెంగుళూరు టైటిల్ గెలిచి త‌న క‌ల‌ను సాకారం చేసుకుంటుందో లేదో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube