బిజినెస్ లో పైకి రావాలంటే కావాల్సింది చిన్నపాటి తెలివితేటలు.ఏదైనా కొత్తగా ఆలోచించి దానిని బిజినెస్ గా మారుస్తే, వారి తలరాతలే మారిపోతాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ నేపథ్యంలో అనేక రకాల వ్యాపారాలు పడిపోయాయి.అయితే ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ లోని ఓ హోటల్ యజమానికి ఆలోచన వచ్చింది.
ఆయన ఉదయం, సాయంత్రం వేళల్లో టీ విక్రయించేవారు.అయితే ఈ కరోనా కాలంలో టీ, కాఫీలు తాగడానికి ఎవరు రాలేదని ఆలోచిస్తున్న నేపథ్యంలో కరోనా టీ అంటూ బోర్డు పెట్టేసాడు.
ఇక అంతే ఆయన వ్యాపారం మూడు కాఫీలు, ఆరు టీలు గా మారిపోయింది.ఇంతకీ ఆయన కరోనా టీ అంటూ ఏమి అమ్ముతున్నాడో తెలుసా…?
కరోనా ని ఎదుర్కొనేందుకు మనిషి శరీరంలో ఇమ్మ్యూనిటి పవర్ పెంచేందుకు అల్లం, మిరియాలు, సొంటి, దాల్చిన చెక్కతో తయారు చేసిన వేడివేడి టీ ని అమ్ముతున్నాడు.అది కూడా కేవలం 10 రూపాయలకే విక్రయిస్తున్నాడు.ఇది తాగిన కొంతమంది వ్యక్తులను ఎలా ఉంది అని అడిగా… చాయ్ తాగడం వల్ల గొంతు లో ఉపశమనం వస్తుందని చెబుతున్నారు.
ఇక ఆ యజమాని మామూలు సమయంలో 50 టీ లు అమ్మడం కష్టమయ్యేదని… కానీ, ఇప్పుడు రోజుకు 600 స్పెషల్ టీ లు అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు.