శాన్‌ఫ్రాన్సిస్‌కో పోలీసులకి కీలక ఆదేశాలు...!!!  

Special Commands To San Francisco Police -

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో టెక్నాలజీ పరగంగా చాలా ముందుండే నగరంగా పేరుంది.ముఖ్యంగా దోషులని పట్టుకోవడంలో అక్కడ నిఘా, పోలీసు సంస్థలు ఉపయోగించే ఫేసియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్వేర్ వారికి మాంచి ఆయుధంగా ఉపయోగపడేది.

Special Commands To San Francisco Police

అయితే తాజాగా ఈ నగర చట్టసభ ప్రతినిధులు ఈ సాఫ్ట్వేర్ వాడకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించవద్దని సిటీ ఏజన్సీలు, పోలీసులకి కీలక ఆదేశాలు ఇచ్చారు.

శాన్‌ఫ్రాన్సిస్‌కో నగర బోర్డ్ సూపర్ వైజర్లు ఈ మేరకు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.అసలు సాఫ్ట్వేర్ పని తనం ఏమిటి ఎందుకు దీనిని నిషేధించారంటే.ఏదైనా ఓ వీడియో లేదా ఫొటోగ్రాఫ్‌ ను చూపితే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా అతని ఆనవాలును గుర్తించేదే ఫేస్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌.చిన్న చిన్న నేరస్తులని, అనుమానితులని పట్టుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగిస్తూఉంటారు.

అయితే ప్రతినిధులు తీసుకున్న తాజా నిర్ణయంలో ఇప్పుడు ఈ టెక్నాలజీ వారికి అందుబాటులోకి లేకుండా పోతోంది కానీ పోలీసులు ఈ టెక్నాలజీ ఉపయోగించాలి అంటే తప్పకుండా అనుమతి తీసుకుని చేయవచ్చని తెలిపారు.గత ఏడాది అన్నాపోలీస్‌లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో అనుమానితులను గుర్తించేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగించారు.దాంతో పౌరహక్కుల నేతలు ఈ వ్యవస్థపై తీవ్ర అభ్యంతరం తెలపడంతో ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Special Commands To San Francisco Police- Related....