ఆ రాష్ట్రంలో కుక్కల కోసం ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంక్..!

రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లు అంటుంటారు.అత్యవసర పరిస్థితుల్లో మనిషికి రక్తం కావాలి అంటే వేరే మనిషి దగ్గరి నుండో, లేదా బ్లడ్ బ్యాంక్ నుండో తీసుకొచ్చి ఎక్కిస్తారు.

 Special Blood Bank For Dogs Established In Ludhiana, Punjab, Blood Bank For Dogs-TeluguStop.com

కానీ అదే పరిస్థితి జంతువులకు వస్తే ఏం చేస్తారు.అయితే చాలా మంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు.

వాటికీ ఎం కావాలో దగ్గర ఉండి మరి చూసుకుంటారు.అందుకేనేమో మనుషులకు కన్న కుక్కలకే విశ్వసం ఎక్కువ.

అయితే పెంపుడు జంతువుల పట్ల వారికీ ఉన్న ప్రేమతో వాటికీ బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేశారు.కుక్కల కోసం ప్రత్యేకంగా ఒక బ్లడ్ బ్యాంక్‌ ను పంజాబ్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు.
అయితే లూధియానాలోని గురు అంగద్ దేవ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీలో కుక్కల కోసం బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు.అంతేకాకుండా కుక్కల రోగాలకు సంబంధించి ప్రతి సంవత్సరం 25 వేల కేసులు వస్తున్నారు.

దీనికి సంబంధించిన విషయాలను వెటర్నరీ డాక్టర్ శుకృతి శర్మ తెలియజేశారు.అయితే 500 నుంచి 600 కేసులకు సంబంధించిన శునకాల్లో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఆయన అన్నారు.

అయితే గతంలో కుక్కకు రక్తం కావాల్సి వచ్చినప్పుడు వేరే కుక్క నుండి రక్తదానం చేసేవారని వైద్యులు తెలిపారు.అయితే కుక్కల కోసం ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయడం వలన ఈ సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు.

ఇక కుక్కల నుండి సేకరించిన రక్తాన్ని రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్ అని మూడు భాగాలుగా వేరు చేస్తారని తెలిపారు.అయితే హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్న కుక్కలకు సేకరించిన రక్తాన్ని వాటికి ఎక్కించడం వలన ఈ సమస్య తీరుతుందని వెటర్నరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శుకృతి శర్మ ఈ సందర్బంగా తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube